స్వామి వివేకానంద ముందుకు క‌ద‌ల్లేదా!

తాజాగా ఈ సినిమా గురించి వెంక‌టేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు రివీల్ చేసారు. స్వామి వివేకా నంద క‌థ ఓ స్థాయి వ‌ర‌కూ వ‌చ్చి ఆగింది.

Update: 2024-01-13 02:30 GMT

హిందూ సన్యాసి - అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులలో ఒకరు స్వామి వివేకానంద. కేవలం ఆధ్యాత్మిక మనస్సు కంటే ఎక్కువ అతను ఫలవంతమైన ఆలోచనాపరుడు. గొప్ప వక్త ఉద్వేగభరితమైన దేశభక్తుడు. తన గురువైన రామకృష్ణ పరమహంస యొక్క స్వేచ్ఛా-ఆలోచనా తత్వాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లిన గొప్ప వ్య‌క్తి. పేదల సేవలో తన సర్వస్వాన్ని- తన దేశం కోసం అంకితం చేస్తూ సమ‌స‌మాజ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేశారు. హిందూ ఆధ్యాత్మికత పునరుజ్జీవనానికి బాధ్యత వహించారు.

ప్రపంచ వేదికల‌పై హిందూ మతాన్ని గౌరవనీయమైన మతంగా స్థాపించారు. సార్వత్రిక సోదరభావం స్వీయ- మేల్కొలుపు అతని సందేశంగా ప్ర‌పంచానికి చాటి చెప్పారు. అలాంటి గొప్ప వ్య‌క్తి జీవితాన్ని కొన్నేళ్ల క్రిత‌మే తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు నీల‌కంఠ ఓ ప్ర‌య‌త్నం చేసారు. విక్ట‌రీ వెంక‌టేష్ వివేకానంద పాత్ర‌లో న‌టించ‌డానికి ఒప్పుకున్నారు. స్టోరీ న‌చ్చ‌డంతో సొంత నిర్మాణ సంస్థ‌లోనే ఈసినిమా చేయాల‌నుకున్నారు.

అయితే అది కార్య‌రూపం దాల్చ‌లేదు. ఆ త‌ర్వాత అదే ప్రాజెక్ట్ ద‌ర్శ‌క‌-ర‌చ‌యిత‌ల చేతులు మారిన‌ట్లు ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా ఈ సినిమా గురించి వెంక‌టేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు రివీల్ చేసారు. స్వామి వివేకా నంద క‌థ ఓ స్థాయి వ‌ర‌కూ వ‌చ్చి ఆగింది. అక్క‌డ నుంచి ముందుకు వెళ్ల‌డం లేదు' అన్నారు. అంత‌కు ముందే ఇతే క‌థ కోసం ఇద్ద‌రు ప‌నిచేస్తున్న‌ట్లు కూడా చెప్పుకొచ్చారు.

దీన్ని బ‌ట్టి ఈ ప్రాజెక్ట్ పై ఇంకా ఫైన‌ల్ కాలేద‌ని తెలుస్తోంది. స్టోరీ ద‌గ్గ‌ర వెంక‌టేష్ సంతృప్తి చెంద‌డం లేద‌ని అర్ధ‌మ‌వుతుంది. ముందు స్టోరీ లాక్ అయితే త‌ప్ప వివేకానందుడు ముందుకు క‌దిలే ప‌రిస్థితి లేద‌ని తేలిపోయింది. అలాగే మరో రెండు...మూడు క‌థ‌లు కూడా ఉన్నాయ‌న్నారు. వాటిపై తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది అని తెలిపారు.

Tags:    

Similar News