మరో క్రేజీ రీమేక్ లో వెంకీమామ!
ఇక తాజాగా మోహన్ లాల్ నటించిన 'నేరు' మూవీ వెంకటేష్ కి బాగా సూట్ అవుతుందనే నమ్మకంతో జీతూ జోసెఫ్ స్వయంగా ఓసారి చూడమని రిక్వెస్ట్ చేశారట.
మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ నాల్ హీరోగా నటించిన 'నేరు' మూవీ డిసెంబర్ 21న మలయాళం లో విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. సలార్, డంకీ లాంటి పెద్ద సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ కంటెంట్ పైన నమ్మకంతో ఈ సినిమాని విడుదల చేశారు. సినిమా అంతా కోర్ట్ రూమ్ డ్రామా అయినప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా నడిపించిన విధానం మలయాళ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.
కలెక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ సినిమాని దృశ్యం సిరీస్ ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్. దృశ్యం సిరీస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ అనే కొత్త జోనర్ ని క్రియేట్ క్రియేట్ చేశారు జీతూ జోసెఫ్. దృశ్యం సృష్టించిన రికార్డులు కేరళలో ఇప్పటికీ చాలా సెంటర్స్ లో అలాగే ఉన్నాయి. ఇక దృశ్యం తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లోనూ దృశ్యం కి భారీ ప్రేక్షకాదరణ దక్కింది.
తెలుగు రిమేక్ మొదటి భాగానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించకపోయిన దృశ్యం 2 బాధ్యతను మాత్రం ఆయనే తీసుకున్నారు. అప్పటినుంచి వెంకటేష్ తో ఆయనకి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ప్రస్తుత మోహన్ లాల్ తో ఈయన దృశ్యం 3 స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే తెలుగులో వెంకటేష్ తో ఇక్కడ రీమేక్ చేస్తారా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక తాజాగా మోహన్ లాల్ నటించిన 'నేరు' మూవీ వెంకటేష్ కి బాగా సూట్ అవుతుందనే నమ్మకంతో జీతూ జోసెఫ్ స్వయంగా ఓసారి చూడమని రిక్వెస్ట్ చేశారట. ప్రజెంట్ సైంధవ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న వెంకటేష్ తప్పకుండా సినిమా చూస్తానని మాట ఇచ్చి తన టీం తో నేరు సక్సెస్ గురించి ఎంక్వైరీ చేయించినట్లు తెలిసింది. ఒకవేళ వెంకీకి సినిమా నచ్చితే కచ్చితంగా దీన్ని తెలుగులో రీమేక్ చేసే అవకాశాలు ఉన్నట్లు తాజా సమాచారం వినిపిస్తోంది. నేరు డబ్బింగ్ రైట్స్ ప్రస్తుతానికి ఎవరి దగ్గర లేవు.
రీమేక్ అయ్యేంత స్ట్రాంగ్ కంటెంట్ కావడంతో హక్కుల నిర్మాణ సంస్థ తమ మధ్య ఉంచుకుంది. హైదరాబాదులో వేసిన పరిమిత షోలు ఫుల్ అవ్వడం చూస్తే ఇక్కడ జనాలకు కూడా బాగానే కనెక్ట్ అవుతుందని అర్థం అవుతుంది. ఒక చూపు లేని అమ్మాయి మానభంగానికి గురైతే దోషులను పట్టించే క్రమంలో లాయర్ అయిన హీరో ఎలా సహాయపడ్డాడు అనే పాయింట్ తోనే ఈ సినిమా ఉంటుంది. లైన్ సింపుల్గా అనిపించినా కథ, కథనం ఆడియన్స్ ని ఎంతో ఎంగేజ్ చేసేలా ఉంటాయి. ఈ సినిమాని వెంకీ కనుక రీమేక్ చేస్తే ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.