'వెనం: ది లాస్ట్ డ్యాన్స్' ట్రైలర్: గగుర్పొడిచే విన్యాసాలు
స్పైడర్ మేన్, సూపర్ మేన్ లు అయినా వెనమ్ కి ఎదురు నిలిచి పోరాడలేరు.
ఒక మనిషి.. అతడిలోని బలీయమైన శక్తి రూపం .. బహుశా అది అతడి బాడీ డబుల్. శక్తి వంతమైన ఈ జీవి (వెనమ్) అతడిలోంచి బయటికి వచ్చి విన్యాసాలు చేస్తుంది. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే దీనికి ప్రత్యేక శక్తులు వచ్చేస్తాయి. వెనమ్ పవర్ ముందు ఇంకే పవర్ నిలవదు. ఒక మనిషిలోని వెనమ్ అమాంతం మృగం కంటే శక్తివంతంగా మారగలదు. స్పైడర్ మేన్, సూపర్ మేన్ లు అయినా వెనమ్ కి ఎదురు నిలిచి పోరాడలేరు.
ఇలాంటి అద్భుతమైన పాత్రను క్రియేట్ చేయడం బావుంది కానీ, ఎందుకనో వీనమ్ తొలి రెండు భాగాలు ఇండియాలో అంతగా ఎక్కలేదు. కానీ ఇప్పుడు మూడో పార్ట్ ట్రైలర్ చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయని అంగీకరించాలి. ఈసారి ట్రైలర్ లో వెనమ్ పోరాట విన్యాసాలు స్పెషల్ గా ఉండబోతున్నాయి. వెనమ్ ని వెతుకుతూ వచ్చే కొత్త జీవాలు గగుర్పాటు పుట్టిస్తున్నాయి. ట్రైలర్ ఆకట్టుకుంది. టామ్ హార్డీ నటన.. వెనమ్ విన్యాసాలు హైలట్ గా కనిపిస్తున్నాయి.
వెనమ్‌కు మానవ హోస్ట్ అయిన ఎడ్డీ బ్రాక్‌గా ఇందులో టామ్ హార్డీ నటించాడు.చివెటెల్ ఎజియోఫోర్, జూనో టెంపుల్, రైస్ ఇఫాన్స్, పెగ్గి లు, అలన్నా ఉబాచ్, స్టీఫెన్ గ్రాహం వంటి తారాగణంతో వెనమ్ 3 ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. వెనం: ది లాస్ట్ డ్యాన్స్‌లో కథాంశం వెనం మునుపటి సొంతప్రపంచానికి తిరిగి వస్తుంది. స్పైడర్ మ్యాన్‌తో ఎలాంటి ప్రత్యక్ష క్రాస్‌ఓవర్ ఉండదు. చాలా మంది స్పైడర్ మాన్ , క్నుల్ ముఖాముఖి ఎదురుకావాలని ఆశించినా అదేమీ ఇందులో లేదు.
కెల్లీ మార్సెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్, మార్వెల్ సంయుక్తంగా నిర్మించాయి. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రత్యేకంగా మనదేశంలో వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్‌ని 3D, ఐమ్యాక్స్ 3Dలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తోంది. అక్టోబర్ 25న అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడవచ్చు.