ద‌స‌రా పోటీ: ఎన్టీఆర్ (Vs) ర‌జ‌నీ-రానా

అక్టోబ‌ర్‌లో ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌ని వెట్ట‌యాన్ టీమ్ ఇదివరకే ప్రకటించింది

Update: 2024-06-03 13:52 GMT

సూపర్‌స్టార్ రజనీకాంత్ లాల్ స‌లామ్ త‌ర్వాత వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. ఆయ‌న‌ తదుపరి విడుదల జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయాన్. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణం సినిమాపై క్రేజ్ రావడానికి ఒక కారణం కాగా జాతీయ అవార్డు సినిమాను అందించిన జ్ఞాన‌వేల్ ప్ర‌తిభ‌పైనా గురి మ‌రో కార‌ణం.

అక్టోబ‌ర్‌లో ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌ని వెట్ట‌యాన్ టీమ్ ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు రజనీకాంత్ స్వయంగా వెట్టయన్ అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ప్ర‌స్తుతం హిమాల‌యాల్లో ఆధ్యాత్మిక యాత్ర‌లో ఉన్న ర‌జ‌నీ ఓ సంభాషణలో ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ విడుదల తేదీని వెల్లడించారు. వేట్టైయాన్ కోసం తన పోర్షన్స్ పూర్తి చేశానని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని రజనీ తెలిపారు.

ఆసక్తికరంగా ఎన్టీఆర్- కొరటాల శివల కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా `దేవర: పార్ట్ 1` కూడా అదే తేదీన విడుదలకు సిద్ధ‌మ‌వుతోంది. దేవ‌ర‌లో భారీ యాక్ష‌న్ తో పాటు VFX కి అధిక స్కోప్ ఉంది. ఎన్టీఆర్ - కొర‌టాల కాంబినేష‌న్ లో ఇది రెండో సినిమా కాబ‌ట్టి టాలీవుడ్‌లో అత్యంత ఆస‌క్తి నెల‌కొంది. తార‌క్ కెరీర్ లోనే భారీ చిత్రం కావ‌డంతో దీనిని అత్యంత భారీగా పాన్ ఇండియా ఆడియెన్ కి రీచ్ అయ్యేలా విడుద‌ల చేయాల‌నేది ప్లాన్. అయితే ఒకే రోజు ఇద్ద‌రు అగ్ర హీరోల సినిమాలు విడుద‌ల‌యితే అది ఓపెనింగుల‌పై ప్ర‌భావం చూపుతుంది. దానివ‌ల్ల రికార్డుల‌కు కూడా గండి ప‌డుతుంది.

Tags:    

Similar News