'ఛావా' బ్రేక్‌ చేసిన రికార్డ్‌లు ఇవే!

కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటి వరకు దాదాపుగా రూ.800 కోట్లకు పైగా నమోదు చేసింది. ఇండియాలో ఇప్పటివరకు దాదాపుగా రూ.600 కోట్ల వసూళ్లను ఛావా దక్కించుకున్నట్లు టాక్‌.;

Update: 2025-03-20 14:44 GMT

ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'ఛావా' సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విక్కీ కౌశల్ ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో నటించిన విషయం తెల్సిందే. శంభాజీ భార్య యేసుబాయి పాత్రలో నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న నటించింది. విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న కాంబోకి మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా శంభాజీ మహారాజ్‌ వీరత్వం చూపించే సన్నివేశాలను దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ అద్భుతంగా రూపొందించాడు. ఈ సినిమాకు రూ.250 కోట్ల వసూళ్లు వస్తే గొప్ప విషయం అనుకున్నారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటి వరకు దాదాపుగా రూ.800 కోట్లకు పైగా నమోదు చేసింది. ఇండియాలో ఇప్పటివరకు దాదాపుగా రూ.600 కోట్ల వసూళ్లను ఛావా దక్కించుకున్నట్లు టాక్‌.

ఒక మీడియం రేంజ్ సినిమాగా 'ఛావా' బాక్సాఫీస్ జర్నీ మొదలైంది. మొదటి రోజు ఛావా సినిమాకు రూ.30 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజు వచ్చిన స్పందనతో మొదటి వీకెండ్‌కి అత్యధిక వసూళ్లు రాబట్టి రికార్డ్‌ల వేట మొదలు పెట్టింది. మొదటి వారంతో పోల్చితే రెండో వారం భారీ వసూళ్లు రాబట్టిన సినిమాగా బాలీవుడ్‌లో అరుదైన రికార్డ్‌ను ఛావా సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఛావా సినిమా నిలిచింది. ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో ఛావా అత్యధిక వసూళ్లు సాధించి నెం.1 గా నిలిచింది. పలు చోట్ల గత ఏడాది విడుదలైన పుష్ప 2 సినిమా రికార్డ్‌ను బ్రేక్‌ చేసింది.

బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ సినిమాగా నిలిచిన స్త్రీ 2 వసూళ్లను సైతం ఛావా సినిమా బ్రేక్‌ చేసింది. అంతే కాకుండా బాలీవుడ్‌ సినిమాల్లో ఇప్పటి వరకు ఏ సినిమా దక్కించుకోని విధంగా ఐదవ వారంలోనూ రూ.20 కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. ఈ స్థాయిలో 5వ వారం భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలు లేవని చెప్పాలి. ఇక హిందీ సినిమాల్లో అత్యధిక టికెట్లు అమ్ముడు పోయిన సినిమాగా ఛావా నిలిచింది అంటూ బుక్‌ మై షో అధికారికంగా ప్రకటించింది. బుక్ మై షో లో ఛావా సినిమాకు ఇప్పటి వరకు 12 మిలియన్‌లకు మించి టికెట్లు బుక్ అయ్యాయి. ఇప్పటి వరకు ఏ హిందీ సినిమాకు ఈ స్థాయిలో టికెట్లు బుక్ కాలేదు. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌గా నిలిచిన పఠాన్‌ ఇతర సినిమాలకు సైతం ఈ స్థాయి బుకింగ్స్ నమోదు కాలేదు.

విక్కీ కౌశల్‌ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఛావా సినిమా నిలిచింది, ఆయన కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ దక్కించుకున్న సినిమాగానూ ఛావా సినిమా నిలిచిందని తెలుస్తోంది. విక్కీ కౌశల్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉరి : ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమా నిలిచింది. ఇప్పుడు ఛావా ఆయన కెరీర్‌లో నిలిచి పోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇప్పటి వరకు నెం.1 స్థానంలో ఉన్న ఛావా సినిమా ఈ ఏడాది చివరి వరకు అదే స్థానంలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో ప్రతి వాలంటైన్స్‌ డేకి సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఏ వాలెంటైన్స్ డే మూవీ కి రాని స్థాయిలో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. గల్లీ బాయ్స్ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నెం.1 స్థానంలో ఉంది. ఆ రికార్డ్‌ను బ్రేక్‌ చేసి ఇప్పుడు ఆ స్థానంను ఛావా దక్కించుకుంది.

Tags:    

Similar News