ఈ ఏడాది ఆరంభంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భిన్నమైన చారిత్రక చిత్రంతో పలకరించాడు నందమూరి బాలకృష్ణ. దీని తర్వాత వచ్చిన ‘పైసా వసూల్’లో మాస్ టచ్ ఉన్నప్పటికీ అది బాలయ్య శైలికి కొంచెం డిఫరెంట్ గా అనిపించేదే. ఐతే ఇప్పుడు బాలయ్య పూర్తిగా తన శైలిలోకి మారిపోయి మాస్ మసాలా సినిమాతో రాబోతున్నాడు. అదే.. ‘జై సింహా’. టీజర్ చూస్తేనే ఈ సినిమా ఎలా ఉంటుందో ఒక అంచనాకు వచ్చేశారు బాలయ్య అభిమానులు. ట్రైలర్ తో మరింత స్పష్టత వచ్చేసింది. ఇది బాలయ్య మార్కు మాస్ మసాలా సినిమా. ఇందులో బోలెడన్ని పంచ్ డైలాగులు.. హీరో ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఘట్టాలు ఉండబోతున్నాయి. ట్రైలర్ అంతటా అవే కనిపించాయి.
‘‘ఎవడ్రా వాడు.. ఆ కళ్లలో మెరుపేంటి, ఎక్కడి నుంచి వచ్చాడు’’ అనే డైలాగుతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత టీజర్లో వినిపించిన ‘‘సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంటుగా ఉందని కొరికితే తల కొరికేస్తది’’ అనే డైలాగ్ కూడా వింటాం. ఆపై.. ‘‘నువ్వంటే కుంభకోణానికి భయం.. నేనంటే రెండు రాష్ట్రాలకు ప్రాణం’’.. ‘‘సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. నరసింహాన్ని చంపాలంటే టైమింగ్ తెలిసుండాలి’’ అంటూ బాలయ్య తనదైన శైలిలో డైలాగులు చెప్పాడు. చివర్లో.. ‘బొమ్మ తిరగేస్తా’ అంటూ ఆగ్రహం చూపించాడు బాలయ్య. ట్రైలర్లోనే కాావాల్సినన్ని యాక్షన్ ఘట్టాలు చూపించారు. మధ్యలో నయనతార.. మిగతా ఇద్దరు హీరోయిన్లతో బాలయ్య రొమాన్స్.. బ్రహ్మితో కామెడీ కూడా ఉన్నాయి. మొత్తంగా సినిమా కొత్తగా లేకున్నా.. బాలయ్య మార్కు మాస్ ఎంటర్టైనర్ అయ్యేలా ఉంది.
Full View