టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుని 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే మూవీతో వచ్చాడు ఆనంద్. వినోద్ అనంతోజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. నవంబర్ 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఫస్ట్ మూవీ 'దొరసాని' తెలంగాణ నేపథ్యంలో రూపొందితే.. లేటెస్ట్ గా హిట్ కొట్టిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' గుంటూరు నేపథ్యంలో తెరకెక్కెంది. అయితే ఇప్పుడు మూడో సినిమా కోసం దేవరకొండ బ్రదర్ రాయలసీమ నేపథ్యాన్ని ఎంచుకున్నాడని తెలుస్తోంది.
ఆనంద్ దేవరకొండ నుంచి రాబోతున్న మూడో సినిమాని విజయ్ దేవరకొండ తన స్వంత నిర్మాణ సంస్థ 'కింగ్ ఆప్ ది హిల్స్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ లో రూపొందిస్తున్నాడట. ఇది అనంతపురం బ్కాక్ డ్రాప్ లో ఉండబోతుందట. అంతేకాకుండా ఈ సినిమాలో ఆనంద్ ఓ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా నటిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఏదేమైనా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కవర్ చేసిన ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు రాయలసీమ నేపథ్యంలో సినిమా తీస్తూ మూడు ఏరియాలను కవర్ చేస్తున్నాడన్నమాట.