ట్రైలర్ టాక్: ఆడడం మొదలు పెడితే లైఫ్ ఆర్ డెత్!

Update: 2018-09-06 11:37 GMT
నిన్న 'స్నీక్ పీక్' తో శాంపిల్ చూపించిన 'నోటా' టీమ్ ఈరోజు ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలిటిషియన్ అనే విషయం ఆల్రెడీ తెలుసు గానీ సీఎం అనే క్లారిటీ ట్రైలర్ తో ఇచ్చారు.  అనుకోని పరిస్థితుల్లో డమ్మీ సీఎం గా ఉండాల్సి వచ్చిన విజయ్ వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరుగుతుంది. ఇక డమ్మీ సీఎం ను ఎవరు ఆ సీట్ లో కూర్చోబెట్టారు.. ఎందుకు విజయ్ అలా డమ్మీ సీఎం లా మారాల్సి వచ్చింది అనే క్యూరియాసిటీ పెంచుతూ ట్రైలర్ ను కట్ చేసి వదిలారు మేకర్స్.

"సిటీలో ఉన్న రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి.. ఇప్పుడు వెంటనే మనం గేట్లు ఎత్తేస్తే చాలా ప్రాంతాలు మునిగిపోతాయి సార్.."  అంటూ బ్యాక్ గ్రౌండ్లో ఒక వ్యక్తి చెప్తున్నా డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది ట్రైలర్.   ఇక "జస్ట్ గో విత్ ద ఫ్లో" అని సత్య రాజ్ అంటే "సార్ నాకస్సలు ఐడియా లేదు ఎక్స్ పీరియెన్స్  లేదు" అంటాడు విజయ్.  ఇక మరో సీన్ లో " ఈ వీడియో గేమ్ లో స్ట్రెయిట్ గా ఎప్పుడైనా లాస్ట్ లెవెల్ కి వెళ్లి ఆడావా?" అంటూ మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేస్తాడు సత్యరాజ్.

ఇక డమ్మీ సిఎం కాబట్టి మందు విందు చిందు పనిలో పనిగా లిప్పు లాకులు కామన్ కదా.  సీఎం అలా చేస్తే మీడియా ఊరుకుంటుందా?  ఒకరేమో "మన కొత్త సీఎం అదో టైపు కదా?" అని అంటే మెహ్రీన్ విలేఖరి పాత్రలో "మన కొత్త ముఖ్యమంత్రి గారి పథకం మందేద్దాం చిందేద్దాం" అని పంచ్ వేస్తుంది.

ఎండ్ లో మాత్రం ఒక స్వామిజి సీఎం సీట్లో కూర్చోవద్దని నాజర్ కు చెప్పినందుకు అలా డమ్మీ సీట్ లో కూర్చోబెట్టారని హింట్ ఇచ్చారు. అదే నిజమా లేక పదివేల కోట్ల స్కామ్ చేసేందుకు దేవరకొండ ను వాడుకున్నారా? అన్నవి ట్రైలర్ చూస్తే మనకు ఎదురయ్యే ప్రశ్నలు.  ఫైనల్ గా ఫ్రస్ట్రేట్ అయిన దేవరకొండ "వెల్ డన్ యూ ఫ**గ్ పొలిటిషియన్స్" అంటాడు.  ట్రైలర్ ఎండ్ లో సత్యరాజ్ "కానీ ఈ గేమ్ లో నువ్వు చూసే రక్తం నిజం.. నీ శత్రువులు నిజం. ఆడడం మొదలుపెట్టావో ఆపడం నీచేతుల్లో లేదు.. లైఫ్ ఆర్ డెత్" అంటాడు

ట్రైలర్ చూస్తుంటే మంచి గ్రిప్పింగ్ డ్రామాను చూడబోతున్నమనే ఇండికేషన్ ఇచ్చారు.  విజయ్ కు ఇది మరో ఇంటెన్స్ రోల్ అనడంలో  సందేహం  లేదు.   ఇంకెందుకు ఆలస్యం.. ఏరూ నోటా బటన్ నొక్కినట్టు మీ మౌస్ బటన్ను నొక్కండి.. ట్రైలర్ ను చూడండి.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి
  

Full View

Tags:    

Similar News