టాలీవుడ్ లో ట్రెండ్ మారిపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మార్పు మంచికే అన్నట్టు మారుతున్న ట్రెండ్ అటు హీరోలకు, ఇటు అప్ కమ్ దర్శకులకు, అటు నిర్మాతలకు ఒకేసారి మేలు చేస్తోంది. లేటెస్టుగా సుకుమార్ ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. కుమారి 21 ఎఫ్ మూవీతో తన శిష్యుడుని డైరెక్టర్ ని చేశాడు. తనే కథ - కథనం ఇచ్చి సినిమాని నిర్మించాడు. ఈ సినిమాతో అప్ కమ్ హీరోకి పెద్ద హిట్టిచ్చాడు. ఓ కొత్త దర్శకుడికి ఊపిరి పోశాడు. ఇది ఎంతో మెచ్చదగిన పరిణామం.
అదే పంథాలో మరో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా కొత్త ప్లాన్ తో ముందుకొస్తున్నాడన్నది హాట్ టాపిక్ ఇప్పుడు. పూరీ తనే స్వయంగా కథ - కథనం - మాటలు రాసుకుని, అప్ కమ్ హీరో రాజ్ తరుణ్ ని కథానాయకుడిగా ఎంపిక చేసుకుని తన శిష్యుడితో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు. తనే స్వయంగా పెట్టుబడుల్ని సమకూర్చేందుకు రెడీ అవుతున్నాడు. దీని వల్ల అటు రాజ్ తరుణ్ కి బూస్ట్ దొరుకుతుంది. మరోవైపు పూరీ తన శిష్యుడిని ప్రమోట్ చేసుకున్నట్టు అవుతుంది. నిర్మాతగా ఓ సక్సెస్ ఫుల్ హీరో వల్ల తనకి కలిసొస్తుంది.
టాలీవుడ్ లో ఇదో కొత్త స్ర్టాటజీ. ఇప్పుడు పూరీతో పాటు అతడి గ్యాంగ్ లో ఉండే రామ్ గోపాల్ వర్మ - కృష్ణవంశీ లాంటోళ్లు కూడా రాజ్ తరుణ్ తో సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇదంతా చైన్ ప్రాసెస్ లా ఒకరికొకరికి లాభాల్ని తెచ్చేదే. మునుముందు ఇతర దర్శకుల్ని - హీరోల్ని ఇది ఇన్ స్పయిర్ చేసే పాయింట్. .. ఇంట్రెస్టింగ్గా లేదూ?