తను మోసపోవడం పై 'ఓపెన్ లెటర్'తో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

Update: 2021-03-04 12:23 GMT
యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఇటీవలే ఓ ఫ్రాడ్ చేతిలో మోసపోయిన విషయం అందరికి తెలిసిందే. జనాలకు అనిపించవచ్చు ఏంటంటే.. అన్ని కోట్లుపెట్టి సినిమాలు తీసే డైరెక్టర్స్ కూడా ఇలాంటి విషయాలలో ఎలా మోసపోతారు అని. కానీ మోసం అనేది ఎవరికీ తెలిసి జరగదు కదా! అయితే డైరెక్టర్ వెంకీ ఈ విషయం పై తనను మోసం చేసిన సదరు వ్యక్తి పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి విషయాలు బయటికి వస్తే సెలబ్రిటీల ఫేమ్ పాడవుతుందని ఎందరు చెప్పినా డైరెక్టర్ చివరిగా ఈ ఇష్యూ పై అసలు నిజాలు తన వెర్షన్ బయటపెట్టేసాడు. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆ ఓపెన్ లెటర్ స్టోరీలో..

"ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నవీన్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. భీష్మా సినిమాకు జాతీయఅవార్డు కోసం అప్లై చేద్దామని అన్నాడు. సేంద్రియ వ్యవసాయం కాన్సెప్ట్ అందులో ఉంది కాబట్టి నేషనల్ అవార్డ్ కోసం దరఖాస్తు చేయడంలో తప్పు లేదనిపించింది. ఆ ఫార్మాలిటీస్ చూసుకోమని నా అసిస్టెంట్ డైరక్టర్ కు చెప్పాను. అందులో భాగంగా 63,600 రూపాయలు ట్రాన్సఫర్ చేశాను. ఓకే ఇదంతా అయిపోయింది అనుకున్నాక సదరు నవీన్ అనే వ్యక్తి మరోసారి వెంకీ కుడుములను సంప్రదించి, ఈసారి మరికొంత డబ్బు ట్రాన్సఫర్ చేయాలని కోరాడు. ఆ డబ్బు రిఫండ్ వస్తుందని కూడా చెప్పాడు. మళ్లీ డబ్బు అడగడంతో నాకు అనుమానం వచ్చింది. వెంటనే విషయం కనుక్కుంటే.. నేను ఇంతకుముందు పంపిన డబ్బు ఫిలిం కార్పొరేషన్ ఎకౌంట్ లో పడలేదు. అదొక వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అని తెలిసింది. డౌట్ వచ్చి కామన్ ఫ్రెండ్ కు ఫోన్ చేశాను. మోసం చేసేవాళ్లు ఎటువైపు నుంచైనా రావొచ్చు."

ఈ విషయం తెలిసాక చాలామంది లైట్ తీసుకోమని చెప్పారు. కానీ నాలా మరొకరు మోసపోకూడదనే ఉద్దేశంతో పోలీస్ కంప్లయింట్ ఇచ్చానని క్లారిటీ ఇచ్చాడు వెంకీ. అలాగే లెటర్ లో చివరగా.. 'పొగత్రాగడం, మద్యం సేవించడంతో పాటు అప్రమత్తంగా లేకపోవడం కూడా హానికరమే' అని రాసుకొచ్చాడు. మొత్తానికి ముసుగులో గుద్దులాటలా ఉన్న ఈ స్టోరీని బయటపెట్టేసాడు వెంకీ. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News