హబ్బీకి ప్రేమతో నయనతార పెదవి ముద్దు!
నయనతార-విగ్నేష్ శివన్ దంపతుల మధ్య అన్యోన్యత గురించి చెప్పాల్సిన పనిలేదు.
నయనతార-విగ్నేష్ శివన్ దంపతుల మధ్య అన్యోన్యత గురించి చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా వేదికగా వారి బాండింగ్ ఎంత బలంగా ఉందన్నది? ఎప్పటికప్పుడు బట్టబయలవుతూనే ఉంటుంది. ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఎంతో ఓపెన్ గా షేర్ చేస్తుంటారు. ప్రత్యేకంగా పుట్టిన రోజున సమయాల్లో ఇద్దరి మధ్య బాండింగ్ ఎంతో ఓపెన్ అని ప్రేమికులుగా ఉన్నప్పుడే చాటి చెప్పారు.
తాజగా విగ్నేష్ శివన్ పుట్టిన రోజు సందర్భంగా హబ్బీకి పెదవి ముద్దు తో బర్త్ డే విషెత్ తెలియజేసింది నయనతార. ఇదిగో ఇక్కడిలా విదేశీ వెకేషన్ లో జోడీ మిడ్ నైట్ సమయంలో ఇలా రెస్టారెంట్ లో డిన్నర్ పార్టీని ఆస్వాదిస్తున్నారు. సమయం అర్దరాత్రి 12 దాటగానే నయనతార భర్త కౌగిలో దూరిపోయింది. ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని ఉండగా నయనతార భర్తని తనవైపు గా తిప్పుకుని పెదవి ముద్దు అందించింది.
తన మనసులో ప్రేమనంతటిని విషెస్ రూపంలో ఇలా చాటి చెప్పింది. విగ్నేష్ అంటే నయన్ కి ఎంతో ఇష్టం. ప్రతీ పుట్టిన రోజుకు విషెస్ ఇలాగే చెప్పడం అన్నది అనవాయితీ. నయనతార పుట్టిన రోజునాడు కూడా ఇలాగే కనిపిస్తారు. తాజాగా ఈ ఫోటో నెట్టింట ట్రెండింగ్ లో నిలిచింది. అందమైన జోడీ ఎంతో అందంగా కనిపిస్తుందంటూ నెటి జనులు పోస్టులు పెడుతున్నారు.
ఇక ఇద్దరు కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా విగ్నేష్..నటిగా నయనతార చాలా బిజీగా ఉన్నారు. అలాగే సొంతంగా స్థాపించిన రౌడీ పిక్చర్స్ పై సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. సొంత నిర్మాణంలో సినిమాలు మాత్రం నయనతార ప్రమోట్ చేస్తుంది. బయట చిత్రాలు అమ్మడు ప్రమోట్ చేయదు అన్న సంగతి తెలిసిందే.