విజయ్ ఆంటోనీ 'హత్య'.. రంగంలోకి బడా సంస్థలు
దీంతో "హత్య" తెలుగు రాష్ట్రాల అంతటా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రీసెంట్ గా "బిచ్చగాడు 2" సినిమాతో బిగ్ సక్సెస్ అందుకున్న సంచలన నటుడు విజయ్ ఆంటోని తన రాబోయే చిత్రంతో మరో పవర్ ఫుల్ హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. "హత్య" అనే టైటిల్ తో రానున్న ఈ థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా మంచి బజ్ క్రియేట్ చేసుకుంటోంది. గ్రిప్పింగ్ కథనం అధిక నిర్మాణ విలువలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేలా సెట్ చేయబడింది. ఇందులో విజయ్ ఆంటోనీ డిటెక్టివ్‌గా ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తున్నాడు.
హత్య సినిమాలో ప్రతిభావంతులైన నటీమణులు రితికా సింగ్ మీనాక్షి చౌదరి కథకు తగ్గట్టుగా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆసక్తిని రేకెత్తిస్తున్న ట్రైలర్ ద్వారా ఉత్పన్నమైన ఉత్కంఠను పెంచిన, చిత్ర బృందం అభిమానుల కోసం మరో అద్భుతమైన అప్‌డేట్‌ను ఇచ్చింది.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్ అలాగే ఏషియన్ సినిమాస్ హత్య సినిమాకు సంబంధించిన తెలుగు రైట్స్‌ను కొనుగోలు చేశాయి. దీంతో "హత్య" తెలుగు రాష్ట్రాల అంతటా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం జులై 21న బిగ్ స్క్రీన్ పైకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఏపీ తెలంగాణలో భారీ స్థాయిలో విడుదలవడం పక్కా అని తెలుస్తోంది.
ఇక వైవిధ్యమైన పాత్రలలో లీనమయ్యే విజయ్ ఆంటోనీ, "హత్య" కథ కోసం కూడా తనను తానా చాలా కొత్తగా మార్చుకున్నాడు. ఇక అతని కొత్త అవతార్ పట్ల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మంచి ఎంటర్‌టైన్మెంట్ సినిమాలను అందించడంలో విజయ్ ఎల్లప్పుడూ ముందుంటాడు. ఇక హత్య సినిమా కూడా వెండితెరపై అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా రూపొందించారని తెలుస్తోంది.
లోటస్ పిక్చర్స్ సహకారంతో ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ నిర్మించిన "హత్య"లో మురళీ శర్మ, జాన్ విజయ్, రాధిక శరత్‌కుమార్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా మరియు ఇతరులు కీలక పాత్రలు పోసించారు.
శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందించగా ఆర్‌కె సెల్వ నైపుణ్యంతో కూడిన ఎడిటింగ్‌తో, ఈ చిత్రం విజువల్‌గా అద్భుతంగా వచ్చినట్లు చెబుతున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ స్వరపరిచిన మంత్రముగ్ధమైన సంగీతం చిత్రానికి ఆకర్షణను జోడించింది.
తమిళం మరియు తెలుగు వెర్షన్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి "హత్య" జూలై 21న విడుదలకు సిద్ధంగా ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద విజయ్ ఆంటోనీ ఎలాంటి రికార్డులను అందుకుంటాడో చూడాలి.