ప్రకాష్ - రాజమౌళి కాంబోలో 'విజయ సింహ'....!

రాజమౌళి తదుపరి సినిమా ను తన కొడుకు ప్రకాష్ కోవెలమూడి తో చేయాలని రాఘవేంద్ర రావు భావించాడు.

Update: 2023-07-18 06:37 GMT

ఆర్ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబు తో కదా.. ఈ ప్రకాష్ ఎవరు అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటి అంటే రాజమౌళి దర్శకత్వం లో ప్రకాష్ కోవెలమూడి హీరో గా చాలా సంవత్సరాల క్రితం 'విజయ సింహా' అనే సినిమా రావాల్సి ఉంది. దాదాపు ఆరు నెలల పాటు చర్చలు.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా కనీసం సెట్స్ పైకి వెళ్లకుండా ఆగిపోయింది.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శిష్యుడిగా సుదీర్ఘ కాలం చేసిన రాజమౌళి 'స్టూడెంట్‌ నెం.1' సినిమా తో సినీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్‌ హిట్ అవ్వడంతో రాజమౌళి తదుపరి సినిమా ను తన కొడుకు ప్రకాష్ కోవెలమూడి తో చేయాలని రాఘవేంద్ర రావు భావించాడు.

ప్రకాష్ కోసం కథ ను రెడీ చేయాలని రాజమౌళి తో రాఘవేంద్ర రావు అడగడం.. అందుకు ఏర్పాట్లు కూడా మొదలు అయ్యాయట. కథ ఎంపిక అయ్యింది.. స్క్రిప్ట్‌ వర్క్ కూడా మొదలు పెట్టారు. టైటిల్ గా విజయ సింహ ని ఖరారు చేయడం జరిగింది. షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది అనుకున్న సమయం లో అనూహ్యంగా సినిమా ను క్యాన్సల్ చేసుకున్నారు.

మొత్తానికి రాజమౌళి.. ప్రకాష్‌ కోవెలమూడి కాంబోలో విజయ సింహా సినిమా ప్రారంభం కాకుండానే ఆగిపోయింది. ప్రకాష్ సినీ ఎంట్రీ రాజమౌళి దర్శకత్వంలో ఉండి ఉంటే కచ్చితంగా మరోలా ఉండేది. కానీ రాజమౌళి తో కాకుండా జాన్ మహేంద్రన్‌ దర్శకత్వంలో 'నీతో' అనే సినిమా తో ప్రకాష్ హీరో గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

ప్రకాష్ సినిమా క్యాన్సిల్‌ అవ్వడంతో రాజమౌళి మళ్లీ ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమా ను రూపొందించాడు. సింహాద్రి సినిమా ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. విజయ సింహా క్యాన్సల్‌ అవ్వడం వల్లే సింహాద్రి సినిమా వచ్చింది. రాజమౌళి సినిమా ను మిస్ చేసుకోవడం వల్లే ప్రకాష్ కోవెలమూడి హీరోగా సక్సెస్ అవ్వలేక పోయాడు.

హీరోగా సక్సెస్ అవ్వలేక పోయిన ప్రకాష్ దర్శకుడిగా కూడా పలు ప్రయత్నాలు చేసి నిరాశ పరిచాడు. హీరోగా... దర్శకుడిగా కూడా ప్రకాష్ సక్సెస్ లను అందుకోలేక పోయాడు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. రాజమౌళి మాత్రం ఇండియాస్ నెం.1 డైరెక్ట్ గా వరుస సినిమా లతో దూసుకుపోతున్న విషయం తెల్సిందే.

Tags:    

Similar News