విజయ్ దేవరకొండ.. ఫస్ట్ టైమ్ ఇలా..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చివరిగా ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

Update: 2024-08-20 05:00 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చివరిగా ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లో లైగర్ తర్వాత అంత పెద్ద డిజాస్టర్ గా మారింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ VD12 సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూజ్ ఫోర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలకి సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటనలు వచ్చేశాయి. అందులో ఒకటి దిల్ రాజు బ్యానర్ లోనే ఉండబోతోంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పాన్ ఇండియా రేంజ్ లోనే పీరియాడికల్ జోనర్ లో ఈ చిత్రం విజయ్ చేయనున్నాడు.

అలాగే మైత్రీ మూవీ మేకర్స్ లో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో VD14 సినిమా విజయ్ దేవరకొండ చేయబోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోందంట. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

VD14 చిత్రంలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడంట. అది కూడా తండ్రి కొడుకులుగా రెండు భిన్నమైన టైం లైన్స్ లో విజయ్ దేవరకొండ పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పాత్రలు దేనికవే భిన్నంగా ఉంటాయంట. అలాగే డిఫరెంట్ లుక్ లో విజయ్ దేవరకొండ కనిపిస్తాడంట. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతి ఇస్తుందనే మాట ప్రచారంలో ఉంది.

టాక్సీవాలా తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తోన్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హెవీగానే ఉన్నాయి. అలాగే డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటిస్తోన్న మూడో సినిమాగా VD14 రానుంది. అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. దీని తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ మూవీ గోదావరి బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో ఉంటుందంట.

Tags:    

Similar News