ఫ్యామిలీ స్టార్.. ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇది కాదు!
తాజాగా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ సినిమా టైటిల్ గురించి ఈ విధంగా చెప్పాడు.
పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమా చేస్తున్నాడు అనగానే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక మృణాల్ ఠాకూర్ జోడీ అనగానే మరింత క్రేజ్ పెరిగింది. అందులోనూ దిల్ రాజు సినిమా కాబట్టి సినిమా మినిమమ్ హిట్ అని డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ కాంబినేషన్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇక మ్యాటర్ లోకి వెళితే పరశురామ్ సినిమాలన్నింటికి టైటిల్స్ ని కథలోనుంచే తీసుకుంటారు. అందుకే అతని సినిమా టైటిల్స్ అన్ని కూడా క్లాసిక్ టచ్ తో ఎక్కువ ఉంటాయి. టైటిల్ తోనే ఆడియన్స్ మూవీకి కనెక్ట్ అయిపోతూ ఉంటారు.
పరశురామ్ మొదటి సినిమా సోలో నుంచి ఫ్యామిలీ స్టార్ వరకు అతను ఒకే ఫార్ములా ఫాలో అవుతూ వచ్చాడు. విజయ్ దేవరకొండతో చేసిన గీతాగోవిందం సినిమా టైటిల్ ని హీరో, హీరోయిన్ పాత్రల పేర్ల నుంచి తీసుకున్నాడు. ఆ మూవీ పరశురామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే విజయ్ దేవరకొండని ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చేసింది.
ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ స్టార్ టైటిల్ కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే రాబోతోంది. సినిమాలో విజయ్ దేవరకొండ పక్కా ఫ్యామిలీ మెన్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై మంచి పాజిటివ్ వైబ్ ఉంది. కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలోని క్యారెక్టర్ స్టైల్ లోనే కాస్ట్యూమ్స్ వేసుకొని ప్రమోషన్స్ చేస్తున్నాడు.
నిజానికి ఈ మూవీకి ముందుగా గోవర్ధన్ అనే టైటిల్ ని అనుకున్నారంట. సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు గోవర్ధన్. తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి ఎంత వరకైనా తనని తాను తగ్గించుకోవడానికి రెడీ అయ్యే వ్యక్తి. కుటుంబానికి అంతగా ప్రాధాన్యత ఇచ్చే గోవర్ధన్ లాంటి వాడు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఉంటారు. అందుకే ఆ టైటిల్ ని అనుకున్నారంట. మరో విశేషం ఏమిటి అంటే విజయ్ తండ్రి పేరు కూడా గోవర్ధన్.
అయితే ఆ టైటిల్ కంటే పబ్లిక్ కి మరింత స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యే టైటిల్ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు తన ఫ్యామిలీని సంతోషంగా ఉంచాలని అనుకునే ప్రతి వాడు ఒక ఆ ఫ్యామిలీకి స్టారే. అందుకే ఈ ఫ్యామిలీ స్టార్ క్యాచీగా జనాల్లోకి వేగంగా రీచ్ అయ్యే విధంగా ఉంటుందని ఫైనల్ గా దీనినే ఖరారు చేసారంట. తాజాగా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ సినిమా టైటిల్ గురించి ఈ విధంగా చెప్పాడు. మరి సినిమా అనుకున్నట్లే ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి.