ఆ ముగ్గురు భామలపై విజయ్ మనసులో మాట!
వాళ్లలో రష్మిక మందన్న...రీతువర్మ ముందు వరుసలో ఉంటారు. అందరీకంటే రష్మికతో అతడి స్నేహం ఎంతో ప్రత్యేకమైనది.
రౌడీబోయ్ విజయ్ దేవరకొండ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లతో కలిసి సినిమాలు చేసాడు. అందులో కొంత మంది మంచి స్నేహితులుగానూ మెలుగుతున్నారు. వాళ్లలో రష్మిక మందన్న...రీతువర్మ ముందు వరుసలో ఉంటారు. అందరీకంటే రష్మికతో అతడి స్నేహం ఎంతో ప్రత్యేకమైనది. ఇద్దరు స్నేహితులుగా ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. తాజాగా ఓ సందర్భంలో ఆ ముగ్గురు భామల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.
'కాలేజీ రోజుల్లోనే 'ఏ మాయ చేసావే' రిలీజ్ అయింది. అందులో సమంతని చూసినప్పటి నుంచి ఆరాధించడం మొదలుపెట్టా. తొలిసారి 'మహానటి' లో కలిసి నటించాం. ఆమె గురించి ఎన్నో విషయాలు తెలసుకున్నా. ఎంతో కమిట్ మెంట్ ఉన్న నటి. ప్రతీ సినిమాని కొత్తగానే ఫీలవుతుంది. 'ఖుషీ' సమయంలో ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా షూటింగ్ చేసింది. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను.
ఇక 'గీతగోవిదం' సినిమా చేసేందుకు చాలా మంది హీరోయిన్లు ముందుకు రాలేదు. అప్పుడే రష్మికని తీసుకున్నాం. ఆ సినిమాకి తాను ఎంతో ఎఫెర్ట్ పెట్టి పనిచేసింది. 'డియర్ కామ్రేడ్' సమయంలో వ్యక్తిగత విమర్శలు ఎదుర్కుంది. అయినా వాటిని పట్టించుకోకుండా లిల్లీ పాత్ర కోసం ప్రాణం పెట్టి పనిచేసింది. ఆ తర్వాత క్రమంగా మంచి అవకశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గామారింది.
అప్పుడే ఆమె శ్రమ వృద్ధాగా పోలేదు అనిపించింది. రష్మిక ఎంతో కష్టపడుతుంది. పాత్ర కోసం ఎంతైన శ్రమించి నటి రష్మిక. ఇక రీతూ వర్మతో రెండుసార్లు పనిచేసాను. 'ఎవడే సుబ్రమణ్యం...పెళ్లి చూపులు'. రీతు తెలుగు ఎంతో బాగా మాట్లాడుతుంది. అందువల్ల తనతో నటించడం చాలా ఈజీగా ఉంటుంది. ఇద్దరం తెలుగులోనే మాట్లాడుకుని ముందుగా ప్రాక్టీస్ చేసి చేసే వాళ్లం. దీంతో టేకుల్ మీద టేక్ లు తీసుకోవడం చాలా వరకూ తగ్గింది' అని ఆ ముగ్గురు గురించి చెప్పుకొచ్చాడు.