బాహుబలి రైటర్.. ఆ సీక్వెల్ స్టొరీలు ఏమయ్యాయి?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. సూపర్ హిట్ సినిమాలకి సీక్వెల్స్ ని దర్శక, నిర్మాతలు చేసే పనిలో ఉన్నారు.

Update: 2024-04-20 04:37 GMT

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. సూపర్ హిట్ సినిమాలకి సీక్వెల్స్ ని దర్శక, నిర్మాతలు చేసే పనిలో ఉన్నారు. మొదటి పార్ట్ హిట్ అయితే రెండో సినిమాకి ఆటోమేటిక్ గా హైప్ వస్తుంది. దాంతో పాటుగా సాలిడ్ బిజినెస్ జరుగుతుంది. సీక్వెల్ మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన వందల కోట్ల కలెక్షన్స్ అందుకోవచ్చని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే సీక్వెల్స్ ని హై లెవెల్లో తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

రైటర్స్ కూడా కథలు రాసేక్రమంలో నెక్స్ట్ సీక్వెల్ కి అవకాశం ఉండేలా స్టోరీస్ సిద్ధం చేస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి విజయేంద్రప్రసాద్. రాజమౌళి సినిమాలకి కథలు రాయడంతో విజయేంద్రప్రసాద్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ లతో దేశవ్యాప్తంగా విజయేంద్ర ప్రసాద్ పేరు మార్మోగిపోయింది.

హిందీలో భజరంగీ భాయ్ జాన్, మణికర్ణిక సినిమాలకి విజయేంద్ర ప్రసాద్ కథలు అందించి సూపర్ హిట్స్ ని ఖాతాలోవేసుకున్నారు. ప్రస్తుతం ఒక మైథలాజికల్ ఫిక్షన్ మూవీకి విజయేంద్ర ప్రసాద్ హిందీలో కథ అందిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమాకి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ఉండటం విశేషం.

నిర్మాత కెకె రాధామోహన్ హిందీలో రుసలాన్ అనే లవ్ అండ్ యాక్షన్ జోనర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 26న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో నిర్మాత రాధామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా కోసం విజయేంద్రప్రసాద్ విక్రమార్కుడు 2 మూవీకి కథ సిద్ధం చేశారని చెప్పారు. హిందీలో రౌడీ రాథోడ్ 2 గా ఆ సినిమా పట్టాలెక్కుచ్చు అనే విధంగా చెప్పారు.

అలాగే భజరంగీ భాయ్ జాన్ సీక్వెల్ స్టోరీ కూడా సిద్ధం చేశారని తెలిపారు. త్వరలో సల్మాన్ ఖాన్ కి కలిసి స్టోరీ చెప్పబోతున్నారంటూ రాధామోహన్ స్పష్టం చేశారు. అయితే భజరంగీ భాయ్ జాన్ సినిమాని తాను నిర్మించడం లేదని తెలిపారు. విక్రమార్కుడు, భజరంగీ భాయ్ జాన్ చిత్రాలు రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వాటికి సీక్వెల్స్ అంటే కచ్చితంగా ఫ్యాన్స్ కి హెవీ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఈ సినిమాలు ఎప్పుడు పట్టాలు ఎక్కుతాయో చూడాలి.

Tags:    

Similar News