ఇదేం ట్విస్ట్ భ‌య్యా?

ష‌ణ్ముగ‌ పాండియ‌న్ సినిమాలో న‌టించి త‌న‌కు అవ‌స‌ర‌మైన స‌హయా న్ని చేస్తాన‌న్నాడు.

Update: 2024-08-16 15:30 GMT

కెప్టెన్ విజ‌య్ కాంత్ స్వ‌ర్గ‌స్తులైన స‌మ‌యంలో లారెన్స్ విజ‌య్ కాంత్ కుమారుడు షణ్ముగ‌పాండియ‌న్ కి ఓ ప్రామిస్ చేసిన సంగ‌తి తెలిసిందే. ష‌ణ్ముగ‌ పాండియ‌న్ సినిమాలో న‌టించి త‌న‌కు అవ‌స‌ర‌మైన స‌హయా న్ని చేస్తాన‌న్నాడు. ప్ర‌స్తుతం అన్బు ద‌ర్శ‌క‌త్వంలో ష‌ణ్ముఖ పాండియ‌న్ హీరోగా 'ప‌డైత‌లైవాన్' అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో లారెన్స్ న‌టిస్తున్న‌ట్లు కూడా ప్ర‌క‌ట‌నొచ్చింది.

అయితే ఇప్పుడీ చిత్రం నుంచి లారెన్స్ ఎగ్జిట్ అయ్యాడు. దీంలో లారెన్స్ ని విజ‌య్ కాంత్ ఫ్యాన్స్ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. సినిమా నుంచి ఎందుకు త‌ప్పుకున్న‌ట్లో స‌రైన వివ‌ర‌ణ ఇవ్వాల‌ని..మాట ఇచ్చి త‌ప్ప‌డం ఏంటి? అని మండి పడుతున్నారు. అయితే లారెన్స్ త‌ప్పుకోవ‌డానికి కార‌ణాలు సైతం వెలుగులోకి వ‌చ్చాయి. ఆ పాత్ర‌లో లారెన్స్ న‌టిస్తే హీరో రోల్ వీక్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు అన్బు అంటున్నాడు.

ఇదే విష‌యాన్ని లారెన్స్ కూడా ద‌ర్శ‌కుడితో చ‌ర్చించిన అనంత‌ర‌మే తాను ఈ సినిమా నుంచి త‌ప్పుకుం టున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. ఎగ్జిట్ అనంత‌రం ఆ సినిమా రిలీజ్ స‌మ‌యంలో ప్ర‌చారానికి లారెన్స్ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని, యూనిట్ కోరితే ఎక్క‌డికైనా వ‌చ్చి ప్ర‌చారం చేయ‌డానికి తాను సిద్దంగా ఉన్న‌ట్లు వినిపిస్తుంది. అయితే అస‌లు కార‌ణం అది కాద‌ని విజ‌య్ కాంత్ అభిమానులు ఆరోపిస్తున్నారు.

లారెన్స్ కి ద‌ర్శ‌కుడు ఆఫ‌ర్ చేసిన పాత్ర న‌చ్చ‌క‌పోవ‌డంతోనే త‌ప్పుకుంటున్నాడ‌ని, అంత‌కు మించి మ‌రే కార‌ణం లేదంటున్నారు. కానీ దీనిపై మాత్రం లారెన్స్ ఎలాంటి బ‌ధులు ఇవ్వ‌లేదు. మ‌రి స్పందిస్తాడా? లేదా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం లారెన్స్ త‌న సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News