పిక్ టాక్ : 45 ఏళ్ల స్టార్ 60 ఏళ్ల లుక్
కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ లో ప్రతినాయకుడి పాత్రలో నటించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ లో ప్రతినాయకుడి పాత్రలో నటించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ నుంచి విజయ్ సేతుపతికి వరుసగా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల మెర్రీ క్రిస్మస్ సినిమా తో హిట్ ను సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ తో పాటు తమిళ్ లో కూడా కత్రీనా తో విజయ్ సేతుపతి చేసిన మెర్రీ క్రిస్మస్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత విజయ్ సేతుపతికి సోలో హీరోగా మంచి విజయం దక్కిందని అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు.
తాజాగా విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున హడావుడి చేశారు. నెట్టింట ఆయన వీడియోలు మరియు ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. తమిళ నటి అంకితా తన సోషల్ మీడియా అకౌంట్ లో విజయ్ సేతుపతితో కలిసి తీసుకున్న ఈ ఫోటోను షేర్ చేసింది.
ఈ ఫోటోలో విజయ్ సేతుపతిని చూసి చాలా మంది అవాక్కవుతున్నారు. బాబోయ్ 45 ఏళ్ల వయసులోనే విజయ్ సేతుపతి నిజంగా 60 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక సినిమా కోసం విజయ్ సేతుపతి ఇలా మేకప్ అయ్యాడని తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ సేతుపతి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైట్ కుర్తా లో తెల్లటి జుట్టు, తెల్ల గడ్డం తో పాటు నెరిసిన మీసాలతో విజయ్ సేతుపతి కనిపించాడు. సాధారణంగా నెరిసిన జుట్టు తో ఎవరైనా అందంగా కనిపించరు. కానీ విజయ్ సేతుపతి ఈ లుక్ లో కూడా బలే మ్యాన్లీ గా కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.