విజయ్ జోరుకు రికార్డులు స్మాష్ అయ్యేలా ఉన్నాయే..

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం లియో.

Update: 2023-10-01 04:33 GMT

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం లియో. మాఫియా బ్యాక్ డ్రాప్ లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ సారి లియోతో లోకేష్ పాన్ ఇండియా టార్గెట్ పెట్టుకున్నాడు. సంజయ్ దత్ లియో మూవీలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ స్ట్రాటజీ నార్త్ లో చిత్రానికి హైప్ తీసుకొస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకి అమ్ముడైపోయాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మాస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడం కూడా లియోపైన బజ్ క్రియేట్ కావడానికి కారణం అని చెప్పొచ్చు.

అలాగే లోకేష్ సినిమాటిక్ విజన్, విజయ్ సక్సెస్ ట్రాక్ కూడా లియోపైన అంచనాలు పెంచుతోంది. జైలర్ మూవీ ఈ ఏడాది కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఏకంగా 600 కోట్ల కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది. `ఇప్పుడు లియో సినిమా రాబోతోంది. ఈ మూవీ కచ్చితంగా జైలర్ కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 250కె కలెక్షన్స్ ని లియో కలెక్షన్స్ చేసింది.

అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మొదటి రోజు ఓవర్సీస్ లో వన్ మిలియన్ క్లబ్ లో లియో చిత్రం కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా కోలీవుడ్ లో హైయెస్ట్ నెంబర్ నమోదు చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కోలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని కూడా లియో బ్రేక్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో నడుస్తోన్న టాక్.

ఇన్ సేడ్ టాక్ ప్రకారం అయితే సినిమా గ్యారెంటీ హిట్ అంట. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా లియో చిత్రం ఈ ఏడాది కోలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ చిత్రం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే జైలర్ రికార్డులని బ్రేక్ చేస్తుందా లేదా అనేది పాజిటివ్ టాక్, ఆడియన్స్ రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News