విజయ్.. ఈసారైనా మనోళ్ళని పలకరిస్తారా?
లోకేష్ కనగరాజ్ చిత్రాలకి తమిళ్ తర్వాత అతి పెద్ద మార్కెట్ తెలుగు రాష్ట్రాలలోని ఉంది.
లోకేష్ కనగరాజ్ చిత్రాలకి తమిళ్ తర్వాత అతి పెద్ద మార్కెట్ తెలుగు రాష్ట్రాలలోని ఉంది. కేవలం లోకేష్ మాత్రమే కాకుండా కోలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాలన్నింటికీ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ హైప్ ఉంటుంది. టాలీవుడ్ ఆడియన్స్ కోలీవుడ్ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు సినిమాలతో సమానంగా చూడటానికి ఇష్టపడతారు. కొన్ని తమిళ్ సినిమాలు అయితే మాతృభాషలో కంటే తెలుగులోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సందర్భాలు ఉన్నాయి.
ఈ విషయం కోలీవుడ్ స్టార్స్ అందరికి తెలుసు. అందుకే తమ సినిమాలు రిలీజ్ చేసే సమయంలో ప్రమోషన్స్ ని తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా గట్టిగా చేస్తారు. తెలుగు మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చి తమ సినిమాలని ప్రమోట్ చేస్తారు. రజినీకాంత్ నుంచి, శివకార్తికేయన్ వరకు అందరూ దీనిని ఫాలో అవుతున్నారు. ఇళయదళపతి విజయ్ కి తుపాకీ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆదరణ పెరిగింది.
అతని నుంచి చివరిగా వచ్చిన మెర్సల్, అదిరింది, మాస్టర్, బీస్ట్ సినిమాలు తెలుగులో మంచి కలెక్షన్స్ సాధించాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లియో సినిమాకి 20 కోట్లకి పైగా బిజినెస్ తెలుగు రాష్ట్రాలలో జరిగింది. ఈ రేంజ్ బిజినెస్ అంటే కచ్చితంగా సినిమాపై టాలీవుడ్ లో ఏ స్థాయి హైప్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్స్ పై ఎలాంటి ఫోకస్ పెట్టలేదు.
కనీసం ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించింది లేదు. ఒక వేళ విజయ్, లోకేష్ ఒకసారి తెలుగు రాష్ట్రాలకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రమోషన్ చేస్తే కచ్చితంగా ఎంతో కొంత ప్లస్ అయితే అవుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకి మాత్రమే ప్రమోషన్స్ చేయకపోయిన తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఇళయదళపతికి కోలీవుడ్ లో ఎలాగూ మంచి మార్కెట్ ఉంది,
ప్రమోషన్స్ చేయకపోయిన భారీ ఓపెనింగ్స్ కి డోకా లేదు. అయితే తెలుగు స్టేట్స్ లో మాత్రం లియో మూవీ ప్రమోషన్స్ ని డిస్టిబ్యూటర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి చిత్ర యూనిట్ ఈ విషయంలో ఎలాంటి ఆలోచన చేస్తుందనేది వేచి చూడాలి.