సీనియర్ బ్యూటీ పెళ్లికి సిద్ధమైందా?
కొన్ని నెలలుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీలకు చెందిన సినీ తారలు
కొన్ని నెలలుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీలకు చెందిన సినీ తారలు.. వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు. సీనియర్ హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమకు నచ్చిన వారితో ఏడడుగులు వేస్తున్నారు. త్వరలోనే నటి వరలక్ష్మి శరత్ కుమార్.. తన ప్రియుడిని పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే అందరికీ ఆహ్వానిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు మరో సీనియర్ బ్యూటీ పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
నటి విమలా రామన్, నటుడు వినయ్ రాయ్.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. వీరిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న విమల, వినయ్.. గత నెలలో తమ లవ్ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా ధ్రువీకరించారు. పెళ్లి అయిన వాళ్లు దిగేలా.. ఫోటో షూట్ చేసి తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు.
అయితే ఇటీవల విమలా రామన్.. నెట్టింట వరుసగా వినయ్ తో దిగిన ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తున్నారు. వీడియోస్ కూడా పంచుకుంటున్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో వీరు వివాహ బంధంలో అడుగు పెడుతున్నట్లు అనిపిస్తోందని కొందరు చెబుతున్నారు. అయితే వారు ఇంకా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, కాబట్టి పెళ్లి విషయంలో ఇంకా వారు నిర్ణయం తీసుకున్నట్లు లేరని ఇంకొందరు అంటున్నారు.
ఇక విమల కెరీర్ విషయానికొస్తే.. ఎవరైనా ఎప్పుడైనా మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు మాలీవుడ్ లో అనేక సినిమాలు నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తెలుగులో కూడా గాయం 2, చుక్కలాంటి అబ్బాయి వంటి చిత్రాలు చేసినా.. హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత రుద్రాంగి, గాండీవధారి అర్జున సహా కొన్ని సినిమాల్లో కీలక పాత్రలో నటించారు.
బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు విమల. అయితే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గాండీవధారి అర్జున మూవీలో విమలా రామన్ కు భర్తగా వినయ్ రాయ్ నటించారు. ఇప్పుడు వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. త్వరలోనే ఈ రీల్ కపుల్.. రియల్ కపుల్ గా మారనున్నట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో వేచి చూడాలి.