వినాయక్ ఇంట్లోనే ఆరోగ్యంగానే..పుకార్లు నమ్మోద్దు!
కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతోన్న వినాయక్ ధైర్యం చేసి సర్జరీకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం సాగింది.
దర్శకుడు వి. వి.వినాయక్ కాలేయానికి సంబంధించి ప్రయివేటు ఆసుపత్రిలో ఓ మేజర్ సర్జరీ జరిగినట్లు నిన్నటి రోజున ఓ వార్త నెట్టింట ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతోన్న వినాయక్ ధైర్యం చేసి సర్జరీకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం సాగింది. దీంతో ఆయన అభిమానులంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. వినాయక్ కి సర్జరీ ఏంటని ఆశ్చర్య పోయారు?
తాజాగా ఈ ప్రచారాన్ని ఆయన సన్నిహిత వర్గాలు ఖండించాయి. వినాయక్ కి ఎలాంటి సర్జరీ జరగలేదని..ఇంట్లోనే ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించాయి. పుకార్లను ఎవరూ నమ్మోదని తెలిపారు. దీంతో వినాయక్ పేరిట నిన్నటి రోజున జరిగిన ప్రచారమంతా అవాస్తమవని తేలిపోయింది.
వినాయక్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన వినాయక్ అటుపై నటుడిగానూ మ్యాకప్ వేసుకునే ప్రయత్నం చేసారు. కానీ మధ్యలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పట్టాలెక్కించిన సినిమాని మధ్యలోనే ఆపేసారు. అప్పటి నుంచి వినాయక్ పేరు సినిమాల పరంగా వినిపించలేదు.
దర్శకుడిగా వినాయక్ ఎంతో మంది స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరోల నుంచి నేటి తరం జనరేషన్ హీరోల వరకూ అందరితోనూ పనిచేసారు. కమర్శియల్ చిత్రాలకు అప్పట్లో వినాయక్ ఓ బ్రాండ్ గా వెలిగారు. బి.గోపాల్ తర్వాత ఆ రేంజ్ సినిమాలు ఆయనే తీయగలరు అన్న గుర్తింపు వినాయక్ సోంతం.