తారక్- కొహ్లీ అంత క్లోజా?
ఈ విషయాన్ని స్వయంగా విరాట్ రివీల్ చేసాడు. తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు నటుడిగా అతన్ని ఎక్కువగా అభిమానిస్తా.
బాలీవుడ్ హీరోలు- ఇండియన్ క్రికెటర్స్ మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. అక్కడ సెలబ్రిటీ కల్చర్ లో క్రికెటర్లు చాలా ఈజీగా మింగిల్ అవుతుంటారు. సెలబ్రిటీల పార్టీలకు..పెళ్లిలకు క్రికెటర్లు హాజరవ్వడం అన్నది తరుచూ జరుగుతూనే ఉంటుంది. అదే రకమైన ర్యాపో ఇతర భాషల హీరోలతో పెద్దగా కనిపించదు. ముంబై వాణిజ్య రాజధాని కావడం కూడా అందుకు మరో కారణం. ముంబైతో క్రికెటర్ల అసోసియేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెలబ్రిటీలు-క్రికెటర్ల మధ్య ఆ రకంగా బాండింగ్ కనిపిస్తుంటుంది.
మిగతా భాషల హీరోలతో క్రికెటర్లు ఎవ్వరూ అంతగా క్లోజ్ అవ్వరు. రజనీకాంత్..కమల్ హాసన్ లా పాన్ ఇండియాలో ఫేమస్ అయితే తప్ప అంత క్లోజ్ గా మూవ్ అవ్వరు. ఈ మధ్య కాలంతో తెలుగు హీరోలు పాన్ ఇండియాలో సక్సెస్ అవ్వడంతో మనోళ్లు కూడా బాగానే ర్యాపో మెయింటెన్ చేస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్- విరాట్ కోహ్లీ కూడా చాలా క్లోజ్ గామూవ్ అవుతారు? అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషయాన్ని స్వయంగా విరాట్ రివీల్ చేసాడు. తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు నటుడిగా అతన్ని ఎక్కువగా అభిమానిస్తా. కొన్నేళ్ల క్రితం అతడితో కలిసి ఓ యాడ్ చేసా . ఆ సమయంలో అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యా .ఆప్యాయంగా మాట్లాడే అతని తీరు నాకెంతో నచ్చుతుంది. 'ఆర్ ఆర్ ఆర్' లో ఎన్టీఆర్ నటన గురించి మాటల్లో చెప్పలేను. అనుష్కతో కలిసి నాటు నాటు పాటకు చాలా రీల్స్ చేసా. గత ఏడాది ఓ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆస్కార్ వచ్చిందని తెలిసింది.
వెంటనే మైదానంలోనే 'నాటు నాటు' పాటకు డాన్స్ చేసా నా సంతోషాన్ని వ్యక్తంచేసా. ప్రత్యేక సందర్భాల్లో ఎన్టీఆర్ కి వీడియో కాల్ చేసి గంటల తరబడి మాట్లాడుతుంటా' అని అన్నారు. దీంతో షాక్ అవ్వడం అభిమానుల వంత్తైంది. తారక్-కొహ్లీ ఇంత క్లోజా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఇంత క్లోజ్ గా టాలీవుడ్ లో ఏ హీరో కూడా మూవ్ అవ్వలేదు ఇంతవరకూ. అందులోనూ విరాట్ లాంటి విధ్వంసం తో తారక్ స్నేహమంటే అభిమానులు విజిల్ వేయాల్సిందే.