నిర్మాతలపై విశాల్ సంచలన వ్యాఖ్యలు!
తెలుగు నటుడైన విశాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని అందరి నోట చర్చనీయాంశమయ్యాడు.
నటుడు విశాల్ ఇటీవలే అవార్డులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనమైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఆయన వ్యాఖ్యలు పెద్ద ప్రకంపనలే రేపాయి. తెలుగు నటుడైన విశాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని అందరి నోట చర్చనీయాంశమయ్యాడు. ఆ వేడి ఇంకా చల్లారాకముందే తాజాగా నిర్మాతల్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. కొంత మంది నిర్మాతల వ్యవహారశైలి వల్ల సినీ పరిశ్రమకు నష్టం జరుగుతోందని వ్యాఖ్యనించారు.
ఆ కారణంగా తాను నిర్మాతగా మారాల్సి వచ్చిందన్నారు. తన సినిమాలు షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని రిలీజ్ అయ్యే సమయానికి నిర్మాతలు ఇబ్బంది పెట్టేవారని ఆరోపించారు. శుక్రవారం సినిమా రిలీజ్ అంటే గురువారం రాత్రి తనను బ్లాక్ మెయిల్ చేసేవారని అసహంన వ్యక్తం చేసారు. ఫైనాన్సియర్ కి డబ్బులు చెల్లించలేదని, సినిమా రిలీజ్ కాదని చెప్పి, తనతో డబ్బులు కట్టించేవారని అన్నారు.
కొంత మంది నిర్మాతలు సరిగ్గా పారితోషికం కూడా చెల్లించేవారు కాదని మండిపడ్డారు. ఇలాంటి ఇబ్బందులు చాలా సందర్భాల్లో చూసానన్నారు. ఆ పరిస్థితి చూసే తాను నిర్మాతగా మారాల్సి వచ్చిందన్నారు. ఇప్పటివరకూ విశాల్ ఏ సందర్భంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తొలిసారి నిర్మాతల్ని ఉద్దేశించి చేయడం కోలీవుడ్ లో చర్చగా మారింది. ఆయన తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు.
అక్కడే సొంతంగా విశాల్ ఫిలిం ప్యాక్టరీ బ్యానర్ స్థాపించారు. బ్యానర్ స్థాపించిన నాటి నుంచి ఎక్కువగా సొంత బ్యానర్లోనే ఇతర సంస్థలతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఆయనే హీరోగా నటిస్తున్నారు. మరి తాజా వ్యాఖ్యలపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
నిర్మాతల మండలికి ఈ వ్యాఖ్యలు చేరితో ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. విశాల్ నటించిన సినిమాల్ని తెలుగులోనూ అనువాదమవుతుంటాయి. ఇక్కడ పంపిణీ దారులతో ఆయనకు మంచి రిలేషన్ షిప్ ఉంది. మరి ఈ వివాదంలో మనవాళ్లు ఎవరైనా ఉన్నారా? అన్నది తెలియాలి.