నయన్ ప్రమోషన్ కు రాకపోవడంతో.. హీరో కామెంట్

అయితే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలా లేదా అనేది నయనతార వ్యక్తిగత ఇష్టం అని, కచ్చితంగా రావాలని నిబంధనలు పెట్టలేమని విశాల్ పేర్కొన్నారు.

Update: 2023-07-29 07:44 GMT

సౌత్ సినిమాలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న హీరోయిన్ నయనతార. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దంకి పైగా అవుతున్న ఇప్పటి స్టార్ హీరోయిన్ గా తన హవాని కొనసాగిస్తోంది. కోలీవుడ్ లో అయితే నయనతార ఫీమేల్ సూపర్ స్టార్ అనే బ్రాండ్ ని సొంతం చేసుకుంది. లేడీ ఒరియాంటెడ్ సినిమాలతోనే ఆమె తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ గా మారిపోయింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ కి జోడీగా జవాన్ మూవీలో నటిస్తోంది. హిందీలో నయనతారకి ఇది మొదటి చిత్రం. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో నయనతారకి ఈ మూవీలో లీడ్ రోల్ కోసం ఎంపిక చేశాడు. సెప్టెంబర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇదిలా ఉంటే నయనతార మీద సౌత్ లో ఒక నెగిటివ్ మార్క్ ఉంది.

ఆమె నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా నయనతర పాల్గొనదు. ఒక వేళ పాల్గొన్న ఒకటి, రెండు స్పెషల్ ఇంటర్వ్యూల వరకే పరిమితం అవుతుంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకూడదని నయనతార కెరియర్ ఆరంభంలోనే కండిషన్ పెట్టుకుంది. ఈ కారణంగానే వాటికి దూరంగా ఉంటుంది. ఆమెని లీడ్ రోల్ కోసం తీసుకున్న దర్శకులు కూడా నయనతార కండిషన్స్ కి ఒకే చెప్పిన తర్వాత అగ్రిమెంట్ చేసుకుంటుంది.

అయితే ఆమె కావాలని ప్రమోషన్స్ కి రాకుండా నిర్మాతలని ఇబ్బందిపెడుతుందనే అపవాదు కూడా ఉంది. అయితే కెరియర్ ఆరంభంలో సినిమా ప్రమోషన్స్ లో జరిగిన ఒక సంఘటన కారణంగానే ఆమె వాటికి దూరంగా ఉంటుంది. తాజాగా హీరో విశాల్ ని మార్క్ ఆంటోనీ మూవీకి సంబందించిన ప్రెస్ మీట్ లో నయనతార గురించి అడిగారు.

సినిమా ప్రమోషన్స్ ని నయనతార రాకపోవడానికి రీజన్ ఏంటి అని విలేకరులు ప్రశ్నించారు. అయితే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలా లేదా అనేది నయనతార వ్యక్తిగత ఇష్టం అని, కచ్చితంగా రావాలని నిబంధనలు పెట్టలేమని విశాల్ పేర్కొన్నారు. ఆమె సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం తనకి ఇష్టంలేదని చెబితే ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. అయితే నా వరకు సినిమా ప్రమోషన్స్ కి ఆమె హాజరైతే బాగుంటుందని మాత్రం చెబుతానంటూ విశాల్ క్లారిటీ ఇచ్చారు.

ఆయన నటించిన మార్క్ ఆంటోనీ పీరియాడికల్ జోనర్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ సినిమా వినాయకచవితికి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. సునీల్ ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News