లియో కథను ఆ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడంటే!

ఈ చిత్రంలో హీరో విశాల్ కూడా నిజానికి నటించాల్సి ఉంది. లోకేష్ కనగరాజ్ కథ కూడా నేరేట్ చేశారు.

Update: 2023-09-02 23:30 GMT

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లియో మూవీ దసరాకి రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కి సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ హెరాల్డ్ దాస్ అనే కీలక పాత్రలో నటించారు. త్రిష, ప్రియా ఆనంద్ ఫీమేల్ లీడ్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూవీ వస్తోంది అంటే కచ్చితంగా ప్రేక్షకులని ఎంగేజ్ చేసే అంశాలు చాలా ఉంటాయని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరో విశాల్ కూడా నిజానికి నటించాల్సి ఉంది. లోకేష్ కనగరాజ్ కథ కూడా నేరేట్ చేశారు. అతను నటించి ఉంటే కచ్చితంగా సినిమాకి మరింత హైప్ వచ్చేది. అయితే విశాల్ తన సినిమా మార్క్ ఆంటోనీతో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఈ కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారంట. ఈ విషయాన్ని స్వయంగా విశాల్ చెప్పడం విశేషం. లియోలో ఒక పాత్ర కోసం లోకేష్ తనని సంప్రదించాడని తెలిపారు. అయితే ఆ కథ తనకి బాగా నచ్చిందని, అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలన అవకాశం వదులుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే విజయ్ తో తనకి మంచి బాండింగ్ ఉందని, కచ్చితంగా భవిష్యత్తులో అతనితో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే వదులుకోనని అన్నారు.

నెగిటివ్ టచ్ ఉన్న హెరాల్డ్ దాస్ పాత్రకోసమే విశాల్ ని లోకేష్ సంప్రదించారంట. అయితే అతను ఒప్పుకోకపోవడంతో యాక్షన్ కింగ్ అర్జున్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్ తరహాలోనే ఈ హెరాల్డ్ దాస్ పాత్రని లోకేష్ డిజైన్ చేసినట్లు రీసెంట్ గా ఆ పాత్రకి సంబందించిన గ్లింప్స్ లో చూపించారు. ఇలాంటి పాత్రలో విశాల్ కనిపించి ఉంటే నెక్స్ట్ లెవల్ లో ఉండేదనే మాట వినిపిస్తోంది.

లోకేష్ కనగరాజ్ సినిమాలో ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకమైన ఆర్క్ ఉంటుంది. అందుకే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుంది. యాక్షన్ కింగ్ అర్జున్ ని ఇమేజ్ ని కూడా ఈ హెరాల్డ్ దాస్ పాత్ర మార్చేస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News