విశ్వక్ 'లైలా' ఫస్ట్ లుక్.. అమ్మాయి గెటప్ లో సడన్ ట్విస్ట్

లైలా గెటప్ లో ఆయన చూపే అందాన్ని నమ్మించడం చాలా కష్టమేమీ కాదు. ఈ గెటప్ తో ఏ హీరో అయినా ఈ విధంగా కనిపించగలరా అనిపించేలా విశ్వక్సేన్ మేకోవర్ ఉంది.

Update: 2024-07-03 05:03 GMT

విశ్వక్సేన్ అంటేనే కొత్తదనానికి, వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్ అని ప్రేక్షకులందరికీ తెలిసిందే. గామీ సినిమాలో ఒక అఘోరా పాత్రలో నటించి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో మాస్ లుక్ తో మరింత కొత్తగా దర్శనమిచ్చాడు. ఇక ఇప్పుడు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న "లైలా"లో విశ్వక్సేన్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. సాహు గారపాటి నిర్మాణంలో రామ్ నారాయణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

 

స్కా ఈ చిత్రంలో విశ్వక్ సేన్ రెండు విభిన్నమైన గెటప్ లలో చేయబోతున్నాడు. అబ్బాయిలా మాత్రమే కాకుండా అమ్మాయి గా కూడా సరికొత్త సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఈరోజు "లైలా" ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది. ఈ లుక్ లో విశ్వక్ సేన్ ఆడ గెటప్ లో ఆకట్టుకుంటున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ మేకోవర్ లో విశ్వక్సేన్ అందంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరచింది.

లైలా గెటప్ లో ఆయన చూపే అందాన్ని నమ్మించడం చాలా కష్టమేమీ కాదు. ఈ గెటప్ తో ఏ హీరో అయినా ఈ విధంగా కనిపించగలరా అనిపించేలా విశ్వక్సేన్ మేకోవర్ ఉంది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈరోజు పూజా కార్యక్రమంతో జరిగింది. "లైలా" సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర చాలా సవాలుతో కూడినదిగా ఉంటుందని, ఆ పాత్రను అంగీకరించడం ఆయనకు పెద్ద సాహసం అని చిత్ర బృందం తెలిపింది.

Read more!

రామ్ నారాయణ విశ్వక్ సేన్ కోసం ప్రత్యేకంగా ఈ స్క్రిప్ట్ తయారు చేశారట. లైలా సినిమాలోని విశ్వక్ సేన్ పాత్ర ప్రణాళిక మరియు నైపుణ్యం పరంగా ఉన్నత స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో అంకక్ష శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. టెక్నికల్ మరియు ప్రొడక్షన్ స్టాండర్డ్స్ పరంగా ఈ చిత్రం అత్యున్నత స్థాయిలో ఉంటుందని, ప్రతి క్రాఫ్ట్స్ మెన్ కూడా ప్రత్యేకంగా ఎంపిక చేయబడ్డారని మేకర్స్ చెబుతున్నారు.

వాసుదేవ మూర్తి రచన, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తానిష్క్ బాగ్చి మరియు ఘిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్ గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. లైలా ఫస్ట్ లుక్ విడుదల తర్వాత, ఈ సినిమా గురించి ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశ్వక్సేన్ ద్విపాత్రాభినయం చేసేటప్పుడు, ఆయన ప్రతిభను, తెరవెనుక కృషిని గుర్తించడానికి ఈ చిత్రం ఒక మంచి అవకాశం అవుతుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న "లైలా" సినిమా విడుదల పై మేకర్స్ త్వరలో ఒక క్లారిటీ ఇవ్వనున్నారు.

Tags:    

Similar News

eac