విశ్వంభర VFX.. వశిష్ఠ ఏం చేస్తాడో?
ఈ సినిమాలో 70% పైగా వీఎఫ్ ఎక్స్ తో ముడిపడ్డ సీన్సే ఉంటాయని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ఠ వెల్లడించారు. అయితే వీఎఫ్ ఎక్స్ వర్క్ చాలా టైం తీసుకుంటుంది.
టాలీవుడ్ లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన హవాను చూపిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆ తర్వాత రీ ఎంట్రీలో వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో చిరంజీవి ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. గతేడాది రెండు సినిమాలు చేసిన చిరు.. ఇప్పుడు విశ్వంభరలో నటిస్తున్న విషయం తెలిసిందే.
హై రేంజ్ విజువల్స్ తో రాబోతున్న విశ్వంభర మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. ఆ తర్వాత భీమవరంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా స్టార్ట్ అయిన కొత్త షెడ్యూల్ లో చిరు పాల్గొన్నారు. అదే సమయంలో మూవీ రిలీజ్ డేట్ ను 2025 జనవరి 10గా మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో 70% పైగా వీఎఫ్ ఎక్స్ తో ముడిపడ్డ సీన్సే ఉంటాయని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ఠ వెల్లడించారు. అయితే వీఎఫ్ ఎక్స్ వర్క్ చాలా టైం తీసుకుంటుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రిలీజ్ డేట్ కు ముందు వశిష్ఠ.. విశ్వంభర వీఎఫ్ ఎక్స్ వర్క్ ను పూర్తి చేయగలరో లేదోనని నెట్టింట కొత్త చర్చ మొదలైంది.
వశిష్ఠకు ఇది పెద్ద సవాలేనని నెటిజన్లు అంటున్నారు. తగినంత సమయం తీసుకుని ఎక్స్ ట్రా ఆర్డినరీ వీఎఫ్ ఎక్స్ ఇస్తారో లేక జనరల్ వీఎఫ్ ఎక్స్ తో రాజీపడతారేమే చూడాలని చెబుతున్నారు. ఇలాంటి సవాళ్లు ఉన్నా.. రిలీజ్ డేట్ ను మేకర్స్ ధైర్యంగా ప్రకటించారని అంటున్నారు. మరోవైపు, ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ బడ్జెట్ తో మేకర్స్ రూపొందించిన 13 సెట్స్ లోనే విశ్వంభరను చాలా వరకు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. చిరంజీవి సరసన హీరోయిన్లు ఎవరన్నది మేకర్స్ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. త్రిష, మృణాల్ ఠాకూర్ తో పలువురు స్టార్ హీరోయిన్లు ఈ సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా.. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.