మెగా స్పీడ్ మాములుగా లేదు!
అయితే ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిన షెడ్యూల్ ను మేకర్స్ తాజాగా కంప్లీట్ చేశారట. ఈ ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ ను భారీ సెట్టింగ్స్ మధ్యలో షూట్ చేశారట.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ బియాండ్ యూనివర్స్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. విశ్వంభర చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టేశారు మేకర్స్.
హై రేంజ్ విజువల్స్ తో రాబోతున్న విశ్వంభర మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. ఆ తర్వాత భీమవరంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవలే మొదలైన కొత్త షెడ్యూల్ లో చిరు పాల్గొన్నారు. అదే సమయంలో మూవీ రిలీజ్ డేట్ ను 2025 జనవరి 10గా మేకర్స్ ప్రకటించారు.
అయితే ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిన షెడ్యూల్ ను మేకర్స్ తాజాగా కంప్లీట్ చేశారట. ఈ ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ ను భారీ సెట్టింగ్స్ మధ్యలో షూట్ చేశారట. సినిమాలో హైలైట్ గా నిలిచే యాక్షన్స్ సీన్స్ ను మేకర్స్ చిత్రీకరించారట. అయితే ఈ మూవీ షూటింగ్ పక్కా ప్లాన్ ప్రకారమే పూర్తి చేసుకుంటుందన్నమాట. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా కోసం వెయిటింగ్ అంటూ సందడి చేస్తున్నారు.
మరోవైపు, నెక్స్ట్ షెడ్యూల్ కోసం విశ్వంభర మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారట. స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద సెట్ ను వేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సెట్ లో మెగాస్టార్‌తో పాటు విలన్స్ పై భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నట్లు టాక్. ఈ సీక్వెన్స్ లో చిరంజీవి గెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని, యాక్షన్ విజువల్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది.
సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతుండగా యూవీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. చిరంజీవి సరసన సీనియర్ బ్యూటీ త్రిష నటిస్తోంది. ఇటీవల సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష. ఈమెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా నటించనున్నట్లు సమాచారం. కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా.. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజై ఎలాంటి హిట్ సాధిస్తుందో చూడాలి.