విశ్వం ట్రైలర్.. యాక్షన్, కామెడీ ఫుల్లుగా!

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వం మూవీపై అటు గోపీచంద్.. ఇటు శ్రీనువైట్ల భారీగా హోప్స్ పెట్టుకున్నారు.

Update: 2024-10-06 08:07 GMT

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వం. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, వేణు దోనెపూడి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వం మూవీపై అటు గోపీచంద్.. ఇటు శ్రీనువైట్ల భారీగా హోప్స్ పెట్టుకున్నారు. మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు.

సినిమాను అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. వరుసగా ప్రమోషనల్ కంటెంట్ ను రివీల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే టీజర్ తో పాటు సాంగ్స్ ను రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే జోష్ తో థియేట్రికల్ ట్రైలర్ ను ఆదివారం విడుదల చేశారు.

'బోర్డర్ దగ్గర టెర్రరిస్టులను తుడిచి పెడుతుంటే.. నేను ఈ దేశం నుంచి టెర్రరిస్టులను పుటిస్తున్నాను.. ఇండియా మొత్తం దీపావళి జరగబోతోంది' అంటూ ఓ ఉగ్రవాది బెదిరింపు డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత సరిహద్దులో విధులు నిర్వర్తించే జవాన్ గా గోపీచంద్ పరిచయమయ్యారు. అదే సమయంలో స్టోరీని చిన్నగా రివీల్ చేస్తూ.. ప్రముఖ నటీనటులను మేకర్స్ చూపించారు. కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. దీంతో ట్రైలర్ ఫన్నీ మోడ్ లోకి వెళ్లింది.

అయితే గోపీచంద్.. రెండు విభిన్నమైన వేరియేషన్స్ ను చూపించడంతో ట్రైలర్ ఓ రేంజ్ లో సాగింది. కావ్య థాపర్ తో హీరో లవ్ స్టోరీని కూడా మేకర్స్ చూపించారు. బ్లాక్ బస్టర్ హిట్ వెంకీ మూవీలోలా వెన్నెల కిషోర్, నరేష్ మధ్య రైలు ఎపిసోడ్‌ తళుక్కుమంది. చివరలో యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్. అందులో గోపీచంద్ అదరగొట్టారు. స్టైలిష్ మేకోవర్ లో కనిపించారు. కావ్య థాపర్ గ్లామరస్ గా కనిపిస్తూ సందడి చేశారు. రైలు ఎపిసోడ్ లో గణేష్, నరేష్, ప్రగతి, పృథ్వీ, సునీల్, రాహుల్ రామకృష్ణ తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.

విశ్వం ట్రైలర్ లో డైరెక్టర్ శ్రీను వైట్ల మార్క్ క్లియర్ గా కనిపించింది. యాక్షన్ తో పాటు కామెడీ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. టెర్రరిజం కాన్సెప్ట్ ను కూడా మేకర్స్ యాడ్ చేసినట్లు అర్థమవుతోంది. వి.గుహన్ సినిమాటోగ్రఫీ, చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ల ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపిస్తున్నాయి. మరి విశ్వం ట్రైలర్ ను మీరు కూడా చూసేయండి.

Full View
Tags:    

Similar News