చిరు కోసం.. ఆ అయిదుగురు దేవ కన్యలు ఎవరో?

మెగాస్టార్‌ చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత సోషియో ఫాంటసీ కథతో వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే

Update: 2023-12-05 10:30 GMT

మెగాస్టార్‌ చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత సోషియో ఫాంటసీ కథతో వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయింది. ఇప్పటికే చిరంజీవి లేని సన్నివేశాల తాలూకు చిత్రీకరణ కొంత మేరకు పూర్తి చేసిన వశిష్ట అసలు కథ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

చిరంజీవి సెట్స్ లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్న ఈ తరుణంలో ఆయనకు జోడీగా నటించాల్సిన హీరోయిన్స్ కోసం చర్చలు, సంప్రదింపులు, అన్వేషణ సాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కథానుసారం హీరో చిరంజీవి అయిదు లోకాల్లో సంచరించాల్సి ఉంటుందట. ఆ అయిదు లోకాల్లో కూడా అయిదుగురు దేవ కన్యలను హీరో కలుస్తాడట.

అందుకే విశ్వంభర సినిమా కోసం ఏకంగా అయిదుగురు హీరోయిన్స్ ని దర్శకుడు ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే త్రిష మరియు మృణాల్ ఠాకూర్ లు విశ్వంభర లో దేవ కన్యలుగా కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు.

అయిదుగురిలో ఇద్దరు దేవ కన్యలు ఎవరు అనేది తేలిపోయింది. మరో ముగ్గురు ఎవరు అనేది స్పష్టత రావాల్సి ఉంది అంటూ సోషల్ మీడియాలో సినిమా గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు హీరోయిన్స్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

నిజంగానే విశ్వంభర సినిమా కోసం అయిదురు హీరోయిన్స్ ని తీసుకుంటే కచ్చితంగా సంచలనంగా చెప్పుకోవచ్చు. సినిమా చిరంజీవి వల్ల కలర్‌ ఫుల్‌ గా నిలిస్తే.. అంతకు మించి అన్నట్లుగా అయిదుగురు ముద్దుగుమ్మలు నటిస్తే అంతకు మించి అన్నట్లుగా కలర్‌ ఫుల్‌ గా ఉంటుందేమో అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. హీరోయిన్స్‌ విషయంలో వశిష్ఠ ఎప్పటికి క్లారిటీ ఇచ్చేనో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News