షాకింగ్156 ఆరు నెలలు అదే పనిలోనా?
మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం `విశ్వంభర` శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం `విశ్వంభర` శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిరంజీవి షూట్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. దీంతో యూనిట్ తదుపరి కొత్త షెడ్యూల్ ప్లానింగ్ వేస్తోంది. మరి ఇప్పటివరకూ షూటింగ్ ఎంతవరకూ పూర్తయింది? అంటే షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మూడు ..నాలుగు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. ఆ లెక్కన మొత్తంగా చిత్రీకరణలో భాగంగా 50 శాతం షూటింగ్ పూర్తయిందని తాజాగా అందుతోన్న సమచారం. మిగిలిన 50 శాతం జూన్ కల్లా పూర్తయ్యేలా దర్శకుడు వషిష్ట ప్లాన్ చేస్తున్నారుట.
ఆపై జులై నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని ప్రణాళిక వేస్తున్నారుట. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఇంతవరకూ పెద్దగా బ్రేక్ తీసుకోకుండా పనిచేయడంతో ప్రధామార్ధం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా రిలీజ్ ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తిచేసి 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ముందే చెప్పేసారు. అంటే జులై నుంచి డిసెంబర్ వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులే జరుగుతాయని తెలుస్తోంది.
అంటే ఆరు నెలలు పాటు సినిమాకి సంబంధించి నిర్మాణానంతర పనులకే కేటాయించినట్లు అవుతుంది. విశ్వంభర సోషియా ఫాంటసీ చిత్రం కావడంతోనే ఇంత సమయం పోస్ట్ ప్రొడక్షన్ కి కేటాయించాల్సి వస్తోందని తెలుస్తోంది. సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే కాన్సెప్ట్ కావడంతోనే ఇదంతా కనిపిస్తుంది. అలాగే ఈ సీజీ వర్క్స్ కి సంబంధించి హాంకాంగ్ కంపెనీకి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం.
అందుకోసం సదరు కంపెనీతో కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్నట్లు భోగట్టా. గతంలో ఇదే కంపెనీకి శంకర్ 2.0 పనులు అప్పగించారుట. ఇప్పుడు ఆయన కాంటాక్ట్ ద్వారానే `విశ్వంభర` గ్రాఫిక్ పనులు సదరు కంపెనీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో `గేమ్ ఛేంజర్` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.