జురాసిక్ పార్క్‌లో అగ్నిహోత్రి ఆటలు సాగుతాయంటారా?
అయితే సలార్ తో ఢీ కొడుతున్న 'ది వ్యాక్సిన్ వార్'ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివేక్ అగ్నిహోత్రి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
అత్యంత వివాదాస్పద చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'తో దేశవ్యాప్తంగా షాక్ వేవ్స్ ని పంపిన తరువాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి .. కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారీ నేపథ్యంలో 'ది వ్యాక్సిన్ వార్' అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ మూవీ నుంచి స్నీక్ పీక్ ని అందించారు. మేకర్స్ మంగళవారం సినిమా టీజర్‌ను ఆవిష్కరించారు. అగ్నిహోత్రి సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించాడు. ఇది అత్యంత భారీ బడ్జెట్ పాన్-ఇండియన్ సినిమా'సలార్'తో పోటీపడుతోంది.
అగ్నిహోత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 29 సెకన్ల టీజర్ 'కోవాక్సిన్' (BBV152 వ్యాక్సిన్) తయారీలో నిమగ్నమైన శాస్త్రవేత్తల కార్యకలాపాలను రివీల్ చేస్తోంది. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. మేకర్స్ అందించిన వివరాల ప్రకారం, కోవిడ్ -19 యుగంలో యుద్ధంలో పోరాడిన శాస్త్రవేత్తలు 130 కోట్ల మంది ప్రజల విజయం తాలూకా కథను తెరపై ఆవిష్కరిస్తున్నారు. అద్భుతమైన నేపథ్య సంగీతంతో ఈ టీజర్ ఆకట్టుకుంది.
ఇక కోవ్యాక్సిన్ తయారీ సమయంలో అధిక స్థాయి వాటాల కారణంగా శాస్త్రవేత్తలు నమ్మశక్యం కాని ఒత్తిడితో కూడిన పరిస్థితులలో పని చేస్తున్నట్లు టీజర్ వెల్లడిస్తోంది. ఈ టీజర్ లో కోవ్యాక్సిన్ తయారీ ల్యాబ్ ని ఆవిష్కరించారు. టీకాల అభివృద్ధిలో రహస్యమైన పురోగతిని వివరిస్తూ ఎలివేటర్ వైపు నడుస్తున్న శాస్త్రవేత్తల బృందం టీజర్ లో కనిపించింది. పల్లవి జోషి సైంటిస్ట్‌గా ఆమె సహాయకులుగా నటిస్తున్న వారి ఫస్ట్‌లుక్ టీజర్‌లో కనిపించింది. భారతదేశపు తొలి బయో-సైన్స్ సినిమాగా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం 28 సెప్టెంబర్ 2023న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'సలార్: పార్ట్ 1'తో బాక్సాఫీస్ పోరులోకి దిగుతోంది.
అగ్నిహోత్రి స్వయంగా రచించిన వ్యాక్సిన్ వార్ లో అతని భార్య నటి పల్లవి జోషి నిర్మించారు. ఇందులో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, రైమా సేన్, పల్లవి జోషి, సప్తమి గౌడ కీలక పాత్రల్లో నటించారు. పెద్ద తెరపై 10 విభిన్న భాషల్లో విడుదల కానున్న మొదటి చిత్రంగా కూడా వ్యాక్సిన్ వార్ గురించి ప్రచారం సాగుతోంది.
అమెరికాలో ముందే కూసిన కోయిల: అయితే సలార్ తో ఢీ కొడుతున్న 'ది వ్యాక్సిన్ వార్'ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివేక్ అగ్నిహోత్రి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తుగా అమెరికా లాంటి చోట్ల ప్రీమియర్ షోలను ప్లాన్ చేసారు. తన కంటెంట్ పై నమ్మకంతో ఆరు వారాల ముందే ఈ ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారీ పాన్ ఇండియా చిత్రం సలార్ తో పోటీకి దిగడమే సాహసం అనుకుంటే ఇప్పుడిలా చాలా ముందే ప్రీమియర్లు వేయాలనుకోవడం మరో గొప్ప సాహసం అని చెప్పాలి. ఇప్పటికే అమెరికా ప్రీమియర్లు స్టార్టయ్యాయి కానీ సోషల్ మీడియల్లో ఎలాంటి రివ్యూలు రాలేదు.
ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 4 వరకూ ఇండియా ఫర్ హ్యుమానిటీ వార్ పేరుతో ది వ్యాక్సిన్ వార్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు అగ్నిహోత్రి. డల్లాస్, హౌస్టన్, డెన్వర్, సాన్ జోస్, లాస్ ఏంజిల్స్, చికాగో, అట్లాంటా, డిసి, రాలే, న్యూ జెర్సీ, న్యూ యార్క్ లో షోలు వేస్తున్నారని సమాచారం.