వివేకా మర్డర్ కేస్ 'వ్యూహం' రెండవ భాగంలో!
తాజాగా ఈ మర్డర్ కేసుని కూడా వర్మ "వ్యూహం"లో చూపించబోతున్నట్లు తెలిపారు. అయితే మొదటి భాగంలో కాకుండా రెండవ భాగంలో హత్య గురించి చూపించనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి అనుమానదాస్పద మృతి దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనమైందో తెలిసిందే. అటుపై అది హత్యగా తేలడంతో కేసు ఎలాంటి టర్నింగ్ లు తీసుకుంటున్నది చూస్తూనే ఉన్నాం. కేసులో రకరకాల ట్విస్ట్ లు బయటపడుతున్నాడు. ఈ హత్యపై ఎన్నో కోణాల్లో దర్యాప్తులు జరుగుతున్నాయి. కేసు కోర్టు ఫరిదిలో ఉంది. ఇందులో హంతకుల నిగ్గు తేల్చేందుకు యంత్రాగం సీరియస్ గా పనిచేస్తోంది.
తాజాగా ఈ మర్డర్ కేసుని కూడా వర్మ "వ్యూహం"లో చూపించబోతున్నట్లు తెలిపారు. అయితే మొదటి భాగంలో కాకుండా రెండవ భాగంలో హత్య గురించి చూపించనున్నారు. "నా దృష్టిలో హత్య కేసు నిందుతులు ఎవరు? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుందన్నారు. అంతకు మించి ఈ కేసు గురించి వర్మ ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడలేదు. వివేకా హత్య కేసులో వైసీపీపై ప్రతిపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గం కేసులో భాగంగా ఆయనపైనా సంచలన ఆరోపణలు చేసారు.
ఇవి రాజకీయ ఆరోపణలా? లేక అవాస్తవాలా? అన్నది వర్మ కోణంలో చూపించే అవకాశం ఉంది. మర్డర్ కేసుకి సంబంధించి వర్మ ఎనాలసీస్ ఎంతో డీప్ గా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా క్రైమ్ స్టోరీలు తెరకెక్కించడంలో వర్మ దిట్ట. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన వాస్తవ సంఘటనల్లో తనదైన మార్క్ ఎనాలసిస్ కనిపిస్తుంది.
మరి "వ్యూహం" రెండవ భాగంలో వివేకా హత్య కేసుని ఏ కోణంలో చూపిస్తారు? హత్యపై వర్మ ఎనాలసిస్ ఎలా ఉంటుదన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే లోకేష్..పవన్ పాత్రల నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్ని సినిమాలో ఎలా చూపిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్ విజయవాడలో జరుగుతోంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన చాలా వివరాలు రివీల్ చేసారు.