వెబ్ సీరీస్ సీక్వెల్.. మేకర్స్ మిస్ అవుతున్న లాజిక్..!
ఒక వెబ్ సీరీస్ సీజన్ సక్సెస్ అయ్యింది అంటే ఆ బజ్ లోనే సెకండ్ సీజన్ కూడా రిలీజ్ చేస్తే అదే జోరులో హిట్ అవుతుంది.
సినిమాలు ఎలాగైతే సీక్వెల్ పేరుతో మొదటి భాగం రెండో భాగం అంటూ రిలీజ్ అవుతున్నాయో.. వెబ్ సీరీస్ లు కూడా అదే తరహాలో సీజన్ 1, సీజన్ 2 అంటూ వస్తున్నాయి. అయితే వీటికి సినిమాలకు తీసుకున్నట్టుగా ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు. సినిమాల విషయంలో అంటే కోట్ల కొద్దీ బడ్జెట్ పెడతారు కాబట్టి ఆ వెయిటింగ్ తప్పనిసరి. కానీ వెబ్ సీరీస్ లు సీజన్ సీజన్ కు మధ్య గ్యాప్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఒక వెబ్ సీరీస్ సీజన్ సక్సెస్ అయ్యింది అంటే ఆ బజ్ లోనే సెకండ్ సీజన్ కూడా రిలీజ్ చేస్తే అదే జోరులో హిట్ అవుతుంది. కానీ ఈమధ్య వెబ్ సీరీస్ లు సీజన్ 1 హిట్ అయినా కూడా సీజన్ 2 కోసం చాలా టైం తీసుకుంటున్నారు. ముఖ్యంగా డిస్నీ హాట్ స్టార్ లో సూపర్ హిట్ అయిన వెబ్ సీరీస్ లలో ఒకటైన సేవ్ ది టైగర్స్ సీజన్ 1 మంచి సక్సెస్ అందుకోగా సీజన్ 2 కోసం ఆడియన్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. సేవ్ ది టైగర్స్ వెబ్ సీరీస్ సీజన్ 1 2023 ఏప్రిల్ చివర్లో రిలీజైంది.
డిస్నీ హాట్ స్టార్ లో సక్సెస్ ఫుల్ వెబ్ సీరీస్ లో ఒకటిగా సేవ్ ది టైగర్స్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే సీజన్ 1 రిలీజైన ఇన్నాళ్లకు మళ్లీ సీజన్ 2 అప్డేట్ వచ్చింది. అంటే దాదాపు ఏడాది తర్వాత సీజన్ 2 ని రిలీజ్ చేస్తున్నారు. సీజన్ 1 ఒక కిడ్నాప్ ట్విస్ట్ తో ముగించగా సీజన్ 2 లో దానికి కొనసాగింపు ఉంటుంది. ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన ఇలాంటి వెబ్ సీరీస్ లు ఇలా ఏడాది తర్వాత సెకండ్ సీజన్ వదలడం వల్ల ఆ సీజన్ చూసిన వారు కూడా సెకండ్ సీజన్ పై ఉన్న ఆసక్తి కోల్పోతారని చెప్పొచ్చు.
సేవ్ ది టైగర్స్ మాత్రమే కాదు జేడీ చక్రవర్తి తో చేసిన దయ వెబ్ సీరీస్ కూడా సీజన్ 1 మంచి సక్సెస్ అందుకుంది. ఆ సీరీస్ సీజన్ 2 సంగతి కూడా మర్చిపోయారు మేకర్స్. మరి సీజన్ 1 కి సీజన్ 2 కి ఇంత గ్యాప్ తీసుకోవడం వల్ల వారికి వచ్చే లాభం ఏమో కానీ నష్టం మాత్రం చాలా ఉంటుందని చెప్పొచ్చు. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 కి ఆడియన్స్ ని ప్రిపేర్ చేసే క్రమంలో సీజన్ 1 ని ఈ 10 రోజులు ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది డిస్నీ హాట్ స్టార్. మరి సేవ్ ది టైగర్స్ సీజన్ 2 ఎలా ఉండబోతుందో చూడాలి. సేవ్ ది టైగర్స్ సీరీస్ కి మహి వి రాఘవ, ప్రదీప్ అధ్వైతం కథ అందించగా తేజ కాకుమాను డైరెక్ట్ చేశారు.