నైజాం రికార్డుల గోల.. మళ్ళీ కొట్టేది ఎవరో..
మన స్టార్ హీరోల సినిమాలకి సంబందించిన నైజాం ఏరియా రైట్స్ కోసం భారీ పోటీ ఉంటుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నైజాం ఏరియాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రాంతం అంతా కూడా నైజాం ఏరియాగా వస్తుంది. ఈ ప్రాంతంలో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటే ఖచ్చితంగా ఆ మూవీ సూపర్ హిట్ క్యాటగిరీలోకి వెళ్తుంది. మన స్టార్ హీరోల సినిమాలకి సంబందించిన నైజాం ఏరియా రైట్స్ కోసం భారీ పోటీ ఉంటుంది.
సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటే దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వసూళ్లు అవుతాయని బయ్యర్లు నైజాం రైట్స్ కోసం పోటీ పడతారు. ఇప్పటివరకు నైజాం ఏరియాలో మొదటిరోజు షేర్ పరంగా చూసుకుంటే టాప్ లో ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచింది. ఈ సినిమా 23.3 కోట్ల షేర్ నైజాంలో మొదటి రోజు కలెక్ట్ చేసింది. రెండవ స్థానంలో 22.6 కోట్లతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ ఉండటం విశేషం.
ఇక మూడో స్థానంలో 13.7 కోట్ల షేర్ తో ఆదిపురుష్ నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం 13.3 కోట్ల షేర్ మొదటి రోజు రాబట్టింది. టాప్ 5లో 12.2 కోట్ల షేర్ తో సర్కారు వారి పాట సినిమా ఉంది. అయితే ఈ ఏడాది టాలీవుడ్ నుంచి అరడజనుకు పైగా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలన్నింటి పైన భారీ అంచనాలు ఉన్నాయి. వీటిలో ఏ సినిమా ఆర్ఆర్ఆర్ మొదటిరోజు నైజాం కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలని ఆసక్తి అందరిలో ఉంది.
ఈ ఏడాది రాబోయే చిత్రాలలో మొదటగా కల్కి 2898 ఏడీ రిలీజ్ అవుతోంది. ఈ మూవీ చాలా ఈజీగా నైజాంలో ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డును బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కల్కి ఫస్ట్ డే నైజాం షేర్ 30 నుంచి 40 కోట్ల మధ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తర్వాత ఐకాన్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా కూడా ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, రామ్ చరణ్ గేమ్ చేంజర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలు కూడా ఈ ఏడాది భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రాబోతున్నాయి. ఇవి కూడా నైజాంలో మొదటి రోజు భారీ వసూళ్లు సాధించే సత్తా ఉన్న సినిమాలే. అయితే వీటిలో ఏ మూవీ ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.