రోజా హీరో కెరీర్ గ్యాప్ కి కారణం అదేనా..?

ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో తన కెరీర్ లో వచ్చిన లాంగ్ గ్యాప్ గురించి చెప్పుకొచ్చారు అరవింద్ స్వామి.

Update: 2024-10-04 01:30 GMT

రీసెంట్ గా దేవరతో పాటు రిలీజన మేయలగన్ అదే తెలుగులో సత్యం సుందరం గా రిలీజైన సినిమాలో సత్యం పాత్రలో అరవింద్ స్వామి నటన ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కార్తీ, అరవింద్ స్వామి ఇద్దరు తమ పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టు అనిపించింది. సత్యం సుందరం ఒకప్పటి ఆప్యాయతలను గుర్తు చేసే సినిమా.. కథనం కాస్త నెమ్మదిగా అనిపించినా సినిమా ప్రేక్షకులను అలరించింది. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో తన కెరీర్ లో వచ్చిన లాంగ్ గ్యాప్ గురించి చెప్పుకొచ్చారు అరవింద్ స్వామి.

రోజా, బొంబాయి సినిమాలతో సూపర్ హిట్ అందుకుని ఆ టైం లో అమ్మాయిల కలల రాకుమారుడు అయిన అరవింద్ స్వామి 2000 నుంచి 2013 వరకు కేవలం రెండు సినిమాలనే చేశారు. 2013 లో తని ఒరువన్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఐతే ఆ సినిమాలో స్టైలిష్ విలన్ గా కొత్త టర్న్ తీసుకున్నారు. అప్పటి నుంచి అరవింద్ స్వామికి వరుస అవకాశాలు వచ్చాయి. ఐతే అరవింద్ స్వామి కెరీర్ గ్యాప్ ఇవ్వడానికి కారణాలు వెల్లడించారు.

తనకు బ్యాక్ పెయిన్ తో పాటుగా కాలికి పక్షవాతం వచ్చిందని దాని వల్లే సినిమాలకు దూరంగా ఉన్నానని అన్నారు అరవింద్ స్వామి. ఐతే అరవింద్ స్వామికి పక్షవాతం అనగానే ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. అది ఒకప్పుడు ఇప్పుడు అంతా సెట్ అయినట్టు తెలుస్తుంది. ఐతే రీ ఎంట్రీ తర్వాత కేవలం ఒకరకమైన పాత్రలకే పరిమితం కాకుండా వెరైటీ రోల్స్ తో మెప్పిస్తున్నారు అరవింద్ స్వామి.

తెలుగులో చరణ్ తో కలిసి ధృవ సినిమాలో నటించారు అరవింద్ స్వామి. తని ఒరువన్ రీమేక్ అవ్వడమే కాదు చరణ్ వల్లే ఆ సినిమా చేశానని ఆ టైం లో ఇంటర్వ్యూలో చెప్పాడు. ఐతే ఆ తర్వాత ఎన్ని తెలుగు సినిమా ఆఫర్లు వచ్చినా అరవింద్ స్వామి చేయలేదు. మరి సత్యం సుందరం తో తెలుగు ఆడియన్స్ ను కూడా అలరించిన అరవింద్ స్వామి ఇప్పటికైనా తెలుగు ఆఫర్లు ఓకే చేస్తారా లేదా అన్నది చూడాలి. ఎలాగు మన వాళ్లు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టేస్తున్నారు కాబట్టి. అరవింద్ స్వామిని కూడా తీసుకుంటే బెటర్ అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

Tags:    

Similar News