తుఫాన్ వచ్చే ముందు 'సలార్' సౌండ్ ఎందుకంటారా?
డిసెం బర్ 22 ఫస్ట్ షో ఎప్పుడు పడుతుందా? అని అంతా ఉత్కంఠగా ఎదురచూస్తోన్న సమయం ఇది.
'సలార్' రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రిలీజ్ కి ఇంకా వారం రోజులే సమయం ఉంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రమిది. ఇప్పటికే అంచనాలు అభిమానుల్లో స్కైని టచ్ చేస్తున్నాయి. 'కేజీఎఫ్' తర్వాత నీల్ మరింత బాధ్యతగా చేసిన చిత్రం జనాల్లోకి వెళ్తుంది. సక్సెస్ కోసం డార్లింగ్ సైతం అంతే కసిగా పనిచేసాడని అభిమానులు విశ్వషిస్తున్నారు.
'సాహో'..'ఆదిపురుష్' పరాజయాలన్నింటికీ 'సలార్' సమాధానం చెబుతుందని అభిమానులు కాలరెగ రేస్తున్నారు. హిట్ కొట్టడం ఖాయమంటూ అభిమానుల మధ్య సీరియస్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. డిసెం బర్ 22 ఫస్ట్ షో ఎప్పుడు పడుతుందా? అని అంతా ఉత్కంఠగా ఎదురచూస్తోన్న సమయం ఇది. మరి ఇంత హైప్ ఉన్న సినిమాకి ప్రచారం ఎక్కడ? అంటే మౌనం మహించాల్సిన సన్నివేశమే కనిపిస్తుంది.
వారం రోజులే సమయం ఉన్నా ఇప్పటివరకూ పాన్ ఇండియాలో చిత్రంబృందం ఎక్కడా ఎలాంటి ఈవెంట్ ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కేవలం సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాల ద్వారా ప్రమోట్ చేస్తున్నారు తప్ప! క్రూ మీడియా ముందుకొచ్చి `సలార్` గురించి చెబుతుంది లేదు. మరీ మౌనం దేనికన్నది? రకరకాల సందేహాలకు తావు ఇవ్వకుండా చేస్తారా? రిలీజ్ వరకూ ఇలాగే ఉంటారా? అన్నది తెలియాలి.
ఓవర్సీస్ లో ఏ తెలుగు సినిమాకి ప్రచారం అవసరం లేదు. అక్కడున్న తెలుగు జనాలకి సినిమా రిలీజ్ అవుతుందనే విషయం తెలిస్తే! చాలు ఆ వారం కోసం ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. రకరకాల సందేహాలు తెరపైకి వస్తుంటాయి. పైగా హొంబలే సంస్థ గతంలో `కేజీఎఫ్` రెండు చిత్రాల్ని ఏ రేంజ్ లో ప్రమోట్ చేసిందో తెలిసిందే. హైదరాబాద్..ముంబై లో ప్రత్యేకంగా ఈవెంట్లు చేసి జనాల్లోకి బలంగా సినిమాని తీసుకెళ్లింది. కానీ సలార్ విషయంలో హోంబలే ఆ చర్యలకు పూనుకోవడం లేదు. మరి తుఫాన్ వచ్చే ముందు `సలార్` సౌండ్ ఎందుకని కాన్పిడెంట్ గా ఉండిపోతున్నారా? అన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక.