నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమానా..?

ప్రస్తుతం ఈ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వస్తున్నాడు అనీల్ రావిపూడి.

Update: 2025-01-06 04:45 GMT

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత తీసిన ప్రతి సినిమా సక్సెస్ కొట్టిన డైరెక్టర్ గా అనీల్ రావిపూడికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. పటాస్ నుంచి భగవంత్ కేసరి సినిమా వరకు అనీల్ రావిపూడి తీసిన ప్రతి సినిమా మాక్సిమం సక్సెస్ అయ్యింది. ఒకటి రెండు కాస్త యావరేజ్ అనిపించుకున్నా ఎక్కువ శాతం హిట్లే పడ్డాయి. అందుకే సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా అనీల్ రావిపూడి అయ్యాడు. ఇక సంక్రాంతికి ఆయన సినిమా వస్తే మంచి సక్సెస్ అన్నట్టే అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వస్తున్నాడు అనీల్ రావిపూడి.

ఈ సినిమా కూడా తన మార్క్ ఎంటర్టైనింగ్ గా ఉంటూనే వెంకటేష్ సినిమాల్లో ఉండే కామెడీ, ఎమోషన్ ని సమపాళ్లలో ఉండేలా చూసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో అనీల్ రావిపూడి తను తీయబోయే నెక్స్ట్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అనీల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబో దాదాపు ఫిక్స్ అయినట్టే అని ఫిల్మ్ నగర్ టాక్. అనీల్ రావిపూడి ఒక లైన్ చెప్పడం దానికి చిరు ఆమోదం తెలపడం జరిగిందట.

మెగాస్టార్ ని అనీల్ ఎలా డైరెక్ట్ చేస్తాడు అన్నది మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది. ఇక ఇదిలా ఉంటే అనీల్ రావిపూడి కింగ్ నాగార్జునతో కూడా సినిమా చేయాలని ఉందని చెప్పాడు. కింగ్ నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా తీస్తానని అంటున్నాడు. నాగార్జున కెరీర్ లో హలో బ్రదర్ సూపర్ హిట్ గా నిలిచింది. మళ్లీ అలాంటి సినిమా వస్తే ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే. ఏదైనా తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం చేసే అనీల్ రావిపూడికి నాగార్జునతో సినిమా పడితే అక్కినేని ఫ్యాన్స్ కి ఫెస్టివల్ అన్నట్టే లెక్క.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ప్రేక్షకుల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. పొంగల్ రేసులో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ రెండు సినిమాలు వస్తున్నాయి. వీటి మధ్యలో వెంకటేష్ సినిమా వస్తుంది. మరి ఈ 3 సినిమాల్లో ఏది మెగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అన్నది చూడాలి. రాంచరణ్, బాలకృష్ణ, వెంకటేష్ మధ్య మాత్రమే కాదు.. శంకర్, బాబీ, అనీల్ రావిపూడి మధ్య కూడా పొంగల్ ఫైట్ టఫ్ గా ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News