యూఎస్ లో సలార్ ని దేవర బీట్ చేస్తుందా?

ఓవరాల్ గా యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు 2.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

Update: 2024-09-24 04:58 GMT
యూఎస్ లో సలార్ ని దేవర బీట్ చేస్తుందా?
  • whatsapp icon

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. దీనికి ఒక రోజు ముందుగా అంటే సెప్టెంబర్ 26న యూఎస్ లో 'దేవర' ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఇప్పటికే ఈ ప్రీమియర్ షోల కోసం పబ్లిక్ భారీగా టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లోనే ‘దేవర’ సినిమాకి సోలోగా యూఎస్ లో హైయెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఓవరాల్ గా యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు 2.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో 'దేవర'కి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే తారక్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందనేది ఒక అంచనా వేయవచ్చు. ఇదిలా ఉంటే మరో వైపు సెప్టెంబర్ 26న వేయబోయే ప్రీమియర్స్ తో కూడా 'దేవర' రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం డార్లింగ్ ప్రభాస్ ‘సలార్’ మూవీ ప్రీమియర్ షో ప్రీ సేల్స్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది.

'సలార్' మూవీ ప్రీమియర్ కి మూడు రోజుల ముందు 45000 టికెట్స్ అమ్ముడయ్యాయి. వాటి ద్వారా 1.2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే ‘దేవర’ మూవీ ప్రీమియర్స్ కి మూడు రోజుల ముందుగా 60000 టికెట్స్ బుక్ అయ్యాయి. అలాగే 1.8 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రీమియర్ షో కలెక్షన్స్ పరంగా ఇప్పటి వరకు ‘సలార్’ కంటే ‘దేవర’నే యూఎస్ లో మొదటి స్థానంలో ఉంది. ఇక ఓవరాల్ ‘సలార్’ మూవీ యూఎస్ కలెక్షన్స్ 8 మిలియన్ డాలర్స్ ఉన్నాయి.

దీనిని కూడా ‘దేవర’ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘దేవర’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ లోనే 5 మిలియన్ డాలర్స్ వరకు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ‘సలార్’ మూవీ హిందీ వెర్షన్ 1.2 మిలియన్ డాలర్స్ యూఎస్ లో వసూళ్లు చేసింది. తెలుగులో 7 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. తమిళంలో 110K డాలర్స్ వసూళ్లు సాధించింది. ‘దేవర’ మూవీ తెలుగు కలెక్షన్స్ భారీగా వచ్చిన ‘సలార్’ హిందీ వెర్షన్ వసూళ్లని క్రాస్ చేయకపోవచ్చని అనుకుంటున్నారు.

ప్రభాస్ మాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ బ్రాండ్ కారణంగా ‘సలార్’ మూవీ హిందీ వెర్షన్ కి కూడా నార్త్ అమెరికాలో భారీ కలెక్షన్స్ వచ్చాయి. అయితే ‘దేవర హిందీ వెర్షన్ కి కేవలం ఎన్టీఆర్ చరిష్మా మాత్రమే కలిసొస్తుంది. సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ లాంటి హిందీ స్టార్స్ ఉన్న వారు కలెక్షన్స్ పై ఎంత ప్రభావం చూపిస్తారనేది చెప్పలేం. ఒక వేళ ‘సలార్’ మూవీ కలెక్షన్స్ రికార్డ్ ని లాంగ్ రన్ లో కూడా ‘దేవర’ బ్రేక్ చేస్తే అది సెన్సేషన్ అవుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Tags:    

Similar News