'దేవ‌ర' కోసం స్నేహితుడు చ‌ర‌ణ్ ని పిల‌వ‌లేడా?

మ‌రి మ‌హేష్ నే తీసుకురాగ‌లిగిన తార‌క్ చ‌ర‌ణ్ ని తీసుకురాలేడా? మ‌రి అలా ఎందుకు చేయ‌డం లేదు?

Update: 2024-09-21 14:30 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే. ఇద‌ర్నీ 'ఆర్ ఆర్ ఆర్' క‌ల‌ప‌డంతో మంచి స్నేహితుల‌య్యారు. నా డార్లింగ్ తార‌క్ అంటూ ఎంతో ప్రేమ చూపించాడు చ‌ర‌ణ్. అలాగే తార‌క్ కూడా అంతే ప్రేమ‌ను చ‌ర‌ణ్ పై చూపించాడు. 'ఆర్ ఆర్ ఆర్' తో ఇద్ద‌రు గ్లోబ‌ల్ స్టార్లు అయ్యారు. పాన్ ఇండియాలో మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.

మ‌రి అంత క్లోజ్ గా ఉండే చ‌ర‌ణ్-తార‌క్ మ‌ధ్య 'దేవ‌ర' రిలీజ్ సంద‌ర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ ఇంట‌ర్వ్య ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న కొంద‌రిలో మొద‌లైంది. తార‌క్ పిలిస్తే చ‌ర‌ణ్ రాకుండా ఉంటాడా? కానీ ఆ ఛాన్స్ తార‌క్ ఇంత‌వ‌ర‌కూ తీసుకోలేదు. త‌న ఇంట‌ర్వ్యూల‌ను సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌..విశ్వ‌క్ సేన్ తో ముగించిన సంగ‌తి తెలిసిందే. తార‌క్ తో పాటు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా పాల్గొన్నారు. అది నెట్టింట వైర‌ల్ అవుతుంది. అది వైర‌ల్ అవ్వ‌డంతో నే చ‌ర‌ణ్ పేరు తెర‌పైకి వ‌చ్చింది.

ఇంకాస్త గ‌తంలోకి వెళ్తే మ‌హేష్ ని సైతం తార‌క్ ఓ సంద‌ర్భంలో ప్ర‌చార ప‌రంగా తీసుకొచ్చారు. తార‌క్ న‌టించిన ఓ సినిమా ఈవెంట్ కోసం మ‌హేష్ అభిమానుల మ‌ధ్య లోకి వ‌చ్చి మాట్లాడారు. అంత‌కు ముందు మ‌హేష్ న‌టించిన సినిమా కోసం తార‌క్ కూడా అతిధిగా హాజ‌రై మాట్లాడారు. మ‌హేష్ ని అన్నా అంటూ ఎంతో ప్రేమ‌తో తార‌క్ పిలుస్తాడు అన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రి మ‌హేష్ నే తీసుకురాగ‌లిగిన తార‌క్ చ‌ర‌ణ్ ని తీసుకురాలేడా? మ‌రి అలా ఎందుకు చేయ‌డం లేదు? ఓవైపు ఎన్టీఆర్ అభిమానుల మ‌ధ్య‌-మెగా అభిమానుల మ‌ధ్య నెట్టింట వైరం కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏపీ ఎన్నిక‌ల వేళ మొద‌లైన ఈ కాక ఇంకా న‌డుస్తూనే ఉంది. తార‌క్ ...చ‌ర‌ణ్ ని తీసు కురాగ‌లిగితే దీనికి కాస్తైనా బ్రేక్ ప‌డేది అన్న‌ది కొందరి వాద‌న‌.

Tags:    

Similar News