నిహారిక సినిమా.. ఇక బాక్సాఫీస్ వద్ద కష్టమే..

దర్శకుడు యదువంశీకి మొదటి సినిమా అయిన కూడా చాలా బ్రిలియంట్ గా గ్రామీణ నేపథ్యంలో ఎమోషన్స్ ని తెరపై ఆవిష్కరించారని ప్రశంసించారు.

Update: 2024-08-14 15:30 GMT

కొణెదల నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమా చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఆగష్టు 9న రిలీజ్ అయినఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆటకే పాజిటివ్ టాక్ వచ్చింది. కొత్త వాళ్ళతో చేసిన కూడా మూవీ కథని అద్భుతంగా నేరేట్ చేశారనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. దర్శకుడు యదువంశీకి మొదటి సినిమా అయిన కూడా చాలా బ్రిలియంట్ గా గ్రామీణ నేపథ్యంలో ఎమోషన్స్ ని తెరపై ఆవిష్కరించారని ప్రశంసించారు.

టాలీవుడ్ సెలబ్రెటీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. రాజమౌళి, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, క్రిష్, నాగ్ అశ్విన్, నాని లాంటి స్టార్స్ అందరూ కూడా కమిటీ కుర్రోళ్ళు మూవీ సక్సెస్ పై కంగ్రాట్స్ చెప్పడంతో పాటు నటీనటులని, టెక్నీకల్ టీమ్ ని అభినందించారు. ఐదు రోజుల్లోనే 8.49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా కమిటీ కుర్రోళ్ళు మూవీ అందుకుంది.

మొదటి నాలుగు రోజుల్లోనే రిలీజ్ అయిన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అందుకొని లాభాల్లోకి వచ్చినట్లు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం మూవీ ప్రాఫిట్ తో థియేటర్స్ లో కొనసాగుతోందని అర్ధమవుతోంది. ఇదే ఊపు కొనసాగితే వీకెండ్ వరకు కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని ఎవరు ఆపలేకపోయేవారు. అయితే ఇండిపెండెంట్స్ డే ఎఫెక్ట్ కమిటీ కుర్రోళ్ళు సినిమా కలెక్షన్స్ మీద ఉండబోతోందని తెలుస్తోంది.

ఆగష్టు 15న తెలుగులో మూడు స్ట్రైట్ సినిమాలతో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా మంచి బజ్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రాలే కావడం విశేషం. రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ మాస్ యాక్షన్ చిత్రాలుగా రిలీజ్ అవుతున్నాయి. అలాగే నార్నె నితిన్ నుంచి ఆయ్ కామెడీ ఎంటర్టైనర్ తో అలరించడానికి రెడీ అవుతోంది.

వీటితో పాటు తమిళ్ నుంచి చియాన్ విక్రమ్ తంగలాన్, బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం వేదా సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఈ ఫ్లోటింగ్ లో కమిటీ కుర్రోళ్ళు సినిమాకి బాక్సాఫీస్ మళ్ళీ అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ రాకపోవచ్చనే మాట వినిపిస్తోంది. భారీ కలెక్షన్స్ ని అందుకోవాలని అనుకున్న నిహారిక టీమ్ కి ఈ ఇండిపెండెంట్స్ డే మూవీస్ అడ్డుకట్ట వేసే ప్రమాదం ఉంది. మరి ఊహించని విధంగా ఏమైనా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి.

Tags:    

Similar News