కల్కి.. ఆ రికార్డ్ బ్రేక్ అవ్వడం పక్కా!

హాలీవుడ్ రేంజ్ లో రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2024-06-06 07:29 GMT

కల్కి.. కల్కి.. కల్కి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూవీ కోసమే చర్చ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అమితాబ్ గ్లింప్స్ చూసి వావ్ అన్నారు. ఇక సినిమాలోని ప్రభాస్ వెహికల్ బుజ్జిని చూసి సినీ ప్రియులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న బుజ్జి అండ్ భైరవ ప్రీలూడ్ వీడియోస్ చూశాక.. నాగ్ అశ్విన్ ను శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు అంతా కల్కి ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. జూన్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కొత్త కల్కి ప్రపంచాన్ని చూసేందుకు సిద్ధం అవ్వడంటూ మరింత బజ్ క్రియేట్ చేశారు. మరోవైపు మేకర్స్.. వరల్డ్ వైడ్ గా జూన్ 27వ తేదీన మూవీని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ మూవీ ఓపెనింగ్స్ కు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కల్కి ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ ఫస్ట్ డే భారీ వసూళ్లు రాబడుతుందని అంటున్నారు. అందుకు కారణంగా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబుతో కల్కి నిర్మాత అశ్వనీదత్ కు మంచి బాండింగ్ ఉంది. దీంతో కల్కి రేట్ల పెంపు, స్పెషల్ షోల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని టాక్.

దీంతో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్ ను కల్కి బ్రేక్ చేస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో RRR చిత్రం రూ.70 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. పూర్తి రన్ టైమ్ లో రూ.230 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీటిని కల్కి అధిగమిస్తుందని అంటున్నారు. అయితే ప్రభాస్ గత చిత్రాలు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే RRR రికార్డ్ బ్రేక్ అవ్వలేదని, ఈసారి పక్కా బద్దలు అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News