రాజ్ తరుణ్.. ఈ బాక్సాఫీస్ టార్గెట్ అందుకుంటాడా?
ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ వరుస ఫెయిల్యూర్స్ కారణంగా సినిమాల బిజినెస్ కూడా క్రమంగా పడిపోయింది.
యంగ్ హీరో రాజ్ తరుణ్ సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. తిరిగి హీరోగా తన ఇమేజ్ నిలబెట్టుకోవడానికి రాజ్ తరుణ్ గట్టిగానే కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇంటరెస్టింగ్ కథలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. అందులో భాగంగానే పురుషోత్తముడు అనే మూవీతో జులై 26న థియేటర్స్ లోకి వచ్చాడు. రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రెడీ అయ్యింది. శ్రీమంతుడు, మహర్షి ఫ్లేవర్ లో మూవీ ఉందనే టాక్ రిలీజ్ కి ముందు వినిపించింది.
అయితే ఆ టాక్ కూడా సినిమా మీద హైప్ పెరగడానికి కారణం అయ్యింది. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ వరుస ఫెయిల్యూర్స్ కారణంగా సినిమాల బిజినెస్ కూడా క్రమంగా పడిపోయింది. దీంతో పురుషోత్తముడు సినిమాని రెంటల్ విధానంలో థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. పెద్దగా బజ్ లేకపోయిన ఈ చిత్రానికి పర్వాలేదనే టాక్ వచ్చింది. రివ్యూలు కూడా మిక్స్డ్ గా వచ్చాయి.
అయితే పర్వాలేదనే టాక్ గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ సినిమాలని కమర్షియల్ గా విజయతీరాలకి చేర్చడం లేదు. అద్భుతంగా ఉందనే టాక్ వస్తేనే కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకుంటున్నాయి. పురుషోత్తముడు సినిమాకి డివైడ్ టాక్ అయితే రాలేదు. ఈ మూవీ ఓవరాల్ గా 1.22 కోట్ల బిజినెస్ వేల్యూతో థియేటర్స్ లోకి వచ్చింది. బ్రేక్ ఈవెన్ రావాలంటే 1.80 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.
మొదటి రోజు పురుషోత్తముడు మూవీ 20 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. రెండో రోజు 20 లక్షలకి పైగానే షేర్ అందుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. మొదటి రోజు కలెక్షన్స్ లెక్క చూసుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే మరో 1.60 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే సినిమాకి పర్వాలేదనే టాక్ వచ్చిన నేపథ్యంలో ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు.
రాయన్ మూవీ ఉన్న కూడా ఫ్యామిలీ ఆడియన్స్ పురుషోత్తముడు సినిమాపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. టార్గెట్ అయితే తక్కువగా ఉంది కాబట్టి బ్రేక్ ఈవెన్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని మాట వినిపిస్తోంది. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ అయితే ఆగష్టు మొదటివారంలో రాబోయే తిరగబడర సామి సినిమాకి కూడా ఆదరణ లభిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.