మెగాస్టార్ ని పరిశ్రమ మరోసారి సన్మానించనుందా!
తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి పద్మవిభూషణ్ అందుకున్న రెండవ నటుడు చిరంజీవి కావడం విశేషం.
దేశంలోనే రెండవ అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ తో మెగాస్టార్ చిరంజీవిని సత్కరించిన సంగతి తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి పద్మవిభూషణ్ అందుకున్న రెండవ నటుడు చిరంజీవి కావడం విశేషం. అంతకు ముందు ఇదే అవార్డుతో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరావుని సత్కరిం చారు. ఇండస్ట్రీలో తొలి పద్మవిభూషణ్ అందుకున్న నటుడిగా ఏఎన్నార్ రికార్డు సృష్టించారు.
ఆ తర్వాత అదే అవార్డు మరో నటుడుకి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. చాలా మంది సీనియర్ నటులున్నా ఎవరికీ పద్మవిభూషణ్ దక్కలేదు. ఆ రకంగా మెగాస్టార్ సినీ చరిత్రలో మరోమైలు రాయిని చేరుకున్నట్లు అయింది. ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరుపున మెగాస్టార్ ని ఘనంగా సత్కరించాడనికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
పరిశ్రమకి ఇంతటి ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందించిన చిరంజీవిని సత్కరించుకోవడం పరిశ్రమ బాధ్యతగా భావించి ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) నుంచి చిరంజీవి ని ప్రత్యేకంగా సన్మానిస్తారా? లేక సైలెంట్ గా ఉంటారా? అన్నది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం `మా` అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు వహిస్తోన్న సంగతి తెలిసిందే.
దాదాపు 15 ఏళ్ల క్రితం మెగాస్టార్ పద్మభూషణ్ అందుకున్నారు. అప్పట్లో పరిశ్రమ మొత్తం చిరంజీవిన ఎంతో ఘనంగా సత్కరించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి చిరంజీవిని సత్కరించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది? ఎక్కడ నిర్వహిస్తారు? అన్నది తెలియాలి.