మనసుతో గెలిచావ్ డార్లింగ్.. కన్నప్ప టీం
ప్రభంజనమై ప్రేక్షక హృదయాలను మనసుతో, వ్యక్తిత్వంతో, నటనతో గెలుచుకుని.. ప్రపంచమంతా శభాష్ అనిపించుకుంటున్న మా ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. శతమానం భవతి శత శత మానం భవతి అంటూ కన్నప్ప స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప` ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రతీ ఇండస్ట్రీలోని స్టార్ హీరో భాగస్వామి అవుతున్నారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, కన్నడ ఇండస్ట్రీ నుంచి శివ రాజ్ కుమార్, కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇలా పాపులర్ స్టార్ల చేరికతో హైప్ పెరిగింది. విష్ణు పాచిక పారి నేషనల్ వైడ్‌గా హైప్ పెరిగింది.
ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23) సందర్భంగా కన్నప్ప టీం డార్లింగ్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపింది. ప్రభంజనమై ప్రేక్షక హృదయాలను మనసుతో, వ్యక్తిత్వంతో, నటనతో గెలుచుకుని.. ప్రపంచమంతా శభాష్ అనిపించుకుంటున్న మా ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. శతమానం భవతి శత శత మానం భవతి అంటూ కన్నప్ప స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం అందించారు. ప్రస్తుతం కన్నప్ప టీం న్యూజిలాండ్‌లో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు.
రెబల్ స్టార్ కనెక్షన్..!
శివ భక్తుడైన కన్నప్ప కథతో దివంగత బాపు దర్శకత్వం వహించిన 1976 తెలుగు భాషా చిత్రం `భక్త కన్నప్ప`. ఈ చిత్రం శైవ భక్తుడైన కన్నప్ప నాయనార్ జీవితం ఆధారంగా రాజ్‌కుమార్ నటించిన 1954 కన్నడ చిత్రం బెదర కన్నప్పకు రీమేక్. అర్జునుడు, కన్నప్ప, తిన్నడుగా ప్రభాస్ పెదనాన్న గారైన కృష్ణం రాజు నటించారు. నీలాగా వాణిశ్రీ, శివుడిగా ఎం. బాలయ్య, కైలాసనాథ శాస్త్రిగా రావుగోపాలరావు నటించారు. సారథి, అల్లు రామలింగయ్య, శ్రీధర్, ప్రభాకర్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు.
నిజానికి రెబల్ స్టార్ కృష్ణం రాజు బెన్-హర్ (1959) నుండి అప్పటికే ఎంతో ప్రేరణ పొందారు. అలాంటి చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. అలాగే భక్త కన్నప్ప చిత్రం బెన్-హర్ తో చాలా ప్రభావితమైంది. పాటల రికార్డింగ్ కోసం, యూనిట్ గిరిజన ప్రాంతాలకు వెళ్లి వారి ట్యూన్స్ రిథమ్‌లను లైవ్ లీగా ఈ చిత్రానికి జోడించారు. నిజానికి ఎన్నియాల్లో పాట వారు చేసిన పరిశోధన ఆధారంగా రూపొందించినది. ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగంలో జాతీయ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి ఎస్.పి.రామనాథన్ ఆడియోగ్రఫీ(లైవ్ లొకేషన్ లో సంగీతం, రీమిక్స్)ని అందించారు.