ప్రపంచంలో అత్యంత ధనిక నటి ఏవరంటే?
మరి ప్రపంచంలో అత్యంత సంపన్న నటి ఎవరు? అంటే టేలర్ స్విప్ట్.. రిహాన్నా, సెలీనా గోమేజ్ అనుకుంటు పప్పులో కాలేసినట్లే.
ప్రపంచంలో అత్యంత సంపన్న నటుడు ఎవరు అన్నది ఇటీవలే తేలిసింది. టామ్ క్రూజ్, షారుఖ్ ఖాన్, డ్వేన్ జాన్సన్ లేదా జానీ డెప్ వంటి హెవీవెయిట్ పేర్లను వెనక్కి నెట్టి అత్యంత ధనిక నటుడిగా ఫ్రాంఛైజీ చిత్రాల నటుడు టైలర్ పెర్రీ నిలిచాడు. మరి ప్రపంచంలో అత్యంత సంపన్న నటి ఎవరు? అంటే టేలర్ స్విప్ట్.. రిహాన్నా, సెలీనా గోమేజ్ అనుకుంటు పప్పులో కాలేసినట్లే.
వాళ్లందర్నీ వెనక్కి నెట్టి అమెరికన్ నటి, ఎంటర్ పెన్యూనర్ జామీ గర్టేజ్ నిలిచారు.ఈవిడ సంపద ఏకంగా పెర్రీ కంటే అధికమని పోర్స్బ్ అంచనా వేసింది. జామీ గెర్టేజ్ నికర ఆస్తి విలువ 8 బిలియన్ డాలర్లు. అంటే 66 వేల కోట్ల రూపాలకు పైగానే. ప్రపంచంలోనే సెలబ్రిటీలందరిలో ఈమె అత్యంత సంపన్నురాలు. టేలర్ స్విప్ట్ 1.6 బిలియర్ డాలర్లు, రిహాన్నా 1.4 బిలియన్ డాలర్లు సెలీనా గోమేజ్ 1.3 బిలియన్ డాలర్లతో గోమేజ్ తర్వాత స్థానాల్లో నిలిచారు.
మడోన్నా నాన్ బిలీయనీర్ గా టాప్-5 లో నిలిచింది. టాప్ 5 లో నిలిచిన ఐదురుగు నటీమణులు నటనతో పాటు ఇతర వ్యాపారాల ద్వారా ఆస్తులు కూడబెట్టారు. రెండు నుంచి నాలుగు స్థానాల మద్య ఉన్న వారు ఎక్కువగా మేకప్ బ్రాండ్ లతో సంపద పోగేసారు. కానీ గెర్టేజ్ మాత్రం వ్యాపార పెట్టుబడులతో సంపద కూడ బెట్టింది. జామీ గెర్టేజ్ జీవితంలో పెద్దగా విజయాలు అంటూ ఏమీ లేవు.
కానీ ఈ స్థాయికి ఎలా చేరిందని అందరిలో ఓ సందేహం ఉంది. అమెరికన్ బిలీయనీర్ వ్యాపార వేత్త టోనీ రెస్లర్ ను వివాహం చేసుకోవడంతో ఆమె దశ తిరగింది. భర్తతో కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. వీరిద్దరు నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ లో అట్లాంటా హక్స్ మేజర్ లీగ్ బేస్ బాల్ లో మిల్వాకీ బ్రూవర్స్ జట్లకు సహ యజమానులుగా ఉన్నారు. జామీ గెర్టెజ్ 80వ దశకంలో నటిగా ప్రారంభమైంది.