'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్'.. కిరణ్ అబ్బవరం సాంగ్ విన్నారా?

చెప్పినట్లు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ ఫుల్ సాంగ్ ను నేడు విడుదల చేశారు మేకర్స్. 'ఏ మొదలు తుదలు లేని ప్రయాణం.

Update: 2024-08-19 15:09 GMT

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. రాజావారు రాణిగారు మూవీతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ఆయన.. ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస చిత్రాలతో అలరించారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. క(KA) చిత్రంతో త్వరలో సందడి చేయనున్నారు.

 

1970స్‌ బ్యాక్ డ్రాప్ లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న క(KA) సినిమాను సుజిత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్సాన్స్‌ దక్కించుకున్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. అదే జోష్ తో రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ ప్రోమోను రిలీజ్ చేశారు.

చెప్పినట్లు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ ఫుల్ సాంగ్ ను నేడు విడుదల చేశారు మేకర్స్. 'ఏ మొదలు తుదలు లేని ప్రయాణం. ఏ అలుపూ సొలుపూ లేని విహారం. ఏ చెరలు తెరలు తెలియని పాదం..ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం అంటూ సాగుతున్న పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. పల్లెటూరి వాతావరణంతో ఉన్న ఈ సాంగ్.. మూవీ ట్రాక్ ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చేసింది. హీరో క్యారెక్టరైజేషన్ కూడా చెబుతోంది.

శనపతి భరద్వాజ్ పాత్రుడు రాసిన వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ పాటకు సామ్ సీఎస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించారు. అందుకు తగ్గట్లు కపిల్ కపిలన్ పాడి తన గాత్రంతో అలరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ ఫుల్ వైరల్ గా మారింది. మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. అయితే కొత్త పాయింట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

ఈ చిత్రంలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీతో కిరణ్ అబ్బవరం ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News