ఇండియాని ఊపేస్తోన్న ఆ బుడ్డొడు ఎవ‌రో తెలుసా?

బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లు ఎంతో మంది నేడు సూప‌ర్ స్టార్లుగా ఎదిగారు.

Update: 2024-10-18 10:30 GMT

సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి ఎలా రాసి పెట్టి ఉంటుందో ముందే చెప్ప‌లేం. బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లే స‌క్సెస్ అవుతారు అన‌డానికి లేదు. బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లు ఎంతో మంది నేడు సూప‌ర్ స్టార్లుగా ఎదిగారు. సీనియ‌ర్ జ‌న‌రేష‌న్ హీరోల్ని ప‌క్క‌న బెడితే ఆ త‌ర్వాత త‌రం న‌టులు కూడా ఎంతో మంది ఎలాంటి స‌పోర్ట్ లేకుండా వ‌చ్చి స‌క్సెస్ అయిన వాళ్లే. అయితే ఎంత ట్యాలెంట్ ఉన్నా? ఆ ప్రోస‌స్ లో ఆవ‌గింజ‌త అదృష్టం కూడా తోడ‌వ్వాలి.

అప్పుడే అది సాధ్య‌మ వుతుంది. ఇప్ప‌టికీ ఎంతో మంది ప్ర‌తిభావంతులు బ‌య‌ట అవ‌కాశాల్లేక తిరుగుతున్నారు. ఒక్క ఛాన్స్ ఎప్పుడు? వ‌స్తుందా? అని ఎదురు చూస్తున్నారు. తాజాగా కింద క‌నిపిస్తోన్న ఈ బుడ్డోడు ఎవ‌రో తెలుసా? అమాయ‌కంగా చొక్క‌..నిక్క‌ర్ వేసుకుని స్కూల్లో ఇలా ఉన్నాడు. ఇప్పుడా బుడ్డొడ్డు దేశాన్నే ఊపేస్తున్నాడ‌ని ఎంత మందికి తెలుసు. అత‌డికి కూడా ఎలాంటి స‌పోర్ట్ లేదు. న‌టుడు అవ్వాల‌న్నా ఆశ‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు.

తొలుత టీవీ సీరియ‌ల్స్ చేసాడు. ఆ త‌ర్వాత సినిమాల‌కు ప్ర‌మోట్ అయ్యాడు. అక్క‌డ నుంచి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఇండియానే ఊపేస్తున్నాడు. ఆ బుడ్డొడు ఎవ‌రో కాదు. క‌న్న‌డ స్టార్ య‌శ్. చిన్న‌ప్పుడు స్కూల్లో దిగిన ఫోటో ఇది. ఓ వేడుకలో తన పాఠశాల ఉపాధ్యాయుల నుండి అవార్డును అందుకుంటున్న సమయంలో తీసిన ఫోటో ఇది. తెల్ల చొక్కా- ఎరుపు రంగు టై- ఖాకీ షార్ట్‌లు ధరించి కనిపించాడు యష్.

ఈపిక్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అప్పుడు అత‌డి వ‌య‌సు ఐదేళ్ల లోపే ఉంటాయి. ఇప్పుడత‌డు పెరిగి పెద్దై పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఓ మ‌హిళ‌కు భ‌ర్త‌గా...పిల్ల‌ల‌కు తండ్రిగా బాధ్య‌త‌లు నెర‌వ‌ర్తిస్తున్నాడు. అత‌డి ఫ్యామిలీ ఫోటోని కూడా చూడొచ్చు. య‌శ్ తో క‌లిసి తొలి సీరియ‌ల్ చేసిన న‌టినే అత‌డు ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

Tags:    

Similar News